
తిరుమలలో భయానక ఘటన జరిగింది. ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. నడక మార్గంలో 7వ మైలు దగ్గర ఐదేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత, చిన్నారిని ఎత్తుకెళ్లింది. అయితే పోలీసులు గట్టిగా అరవడంతో బాలుడిని చిరుత వదిలేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన చిన్నారిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి బయల్దేరారు. ఈ ఘటనతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.