తల్లి వివాహేతర సంబంధం.. మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య....

By Bukka SumabalaFirst Published Aug 13, 2022, 1:18 PM IST
Highlights

తల్లి వివాహేతర సంబంధం తట్టుకోలేని కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరులో విషాదాన్ని నింపింది. తల్లిని ఎన్నిసార్లు వారించినా వినకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేలింది.
 

ఏలూరు : తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందన్న మనస్తాపంతో కొడుకు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏలూరు జిల్లా భీమడోలులో శుక్రవారం జరిగింది. ఎస్ఐ చావా సురేష్ కథనం ప్రకారం... భీమడోలు గాంధీబొమ్మ సెంటర్ కు చెందిన దాసరి వెంకట్ (21) తాపీ కార్మికుడు, అతని చిన్నతనంలోనే తండ్రి మృతి చెందగా, తల్లితో కలిసి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గత కొన్నేళ్లుగా తన తల్ల వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంగా తల్లీ కొడుకుల మధ్య గొడవలు జరుగుతుండేవి. అలా చేయవద్దని తల్లిని చాలాసార్లు మందలించాడు. 

అయినా ఆమె తీరు మారలేదు. శుక్రవారం తాపీ పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి భోజనం చేసేందుకు వచ్చాడు. ఆ సమయంలో తల్లి, ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో కనిపించింది. దీంతో వెంకట్ కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే తల్లితో గొడవపడ్డాడు. కోపంతో బయటికి వెళ్లిపోయి.. మద్యం సేవించాడు. తిరిగి ఇంటికి వచ్చిన వెంకట్ లోపలికి వెళ్లి గడియ పెట్టుకుని తల్లి చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. కొద్ది సేపటికి అతని స్నేమితుడు ఆనంద్ ఇంటికి రావడంతో ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

కర్నూలు జిల్లాలో టెన్త్ విద్యార్థినితో యువకుల అసభ్య ప్రవర్తన..

ఇదిలా ఉండగా, తుపాకీతో కాల్చి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఈ నెల 4న నల్గొండ జిల్లాలో సంచలనం రేపింది. అయితే ఈ కాల్పులు, హత్యాయత్నం వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిందని తేలింది. నెల 4న జరిగినహత్యా యత్నం కేసులో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ రేమా రాజేశ్వరి తెలిపారు.  నిందితుల నుంచి ఒక పిస్టల్, 9 ఫోన్ లు, రూ.4,500 నగదు, ప్రామిసరీ  నోట్లు, రెండు బ్యాంక్ చెక్ బుక్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు.

మర్రిగూడ మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి బాలకృష్ణ ప్రస్తుతం హైదరాబాదులోని వనస్థలిపురంలో ఉంటున్న నార్కట్పల్లి మండలం గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అదే స్కూల్ లో మిడ్ డే మీల్స్ వర్కర్ గా పని చేస్తున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఆమె భర్త నిమ్మల స్వామిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. దీనికోసం ముందుగా యాచారం మండలం మాల్ ప్రాంతానికి చెందిన రామస్వామితో మూడు లక్షల రూపాయలకు సుపారీ కుదుర్చుకున్నారు.  

అడ్వాన్స్ గా రూ.1.70లక్షలు తీసుకున్న రామస్వామి  మునుగోడు నిమ్మలస్వామి దుకాణం పక్కనే మరో దుకాణం అద్దెకు తీసుకుని అందులో పనిచేస్తున్న మొహినుద్దీన్ తో పరిచయం పెంచుకున్నాడు.  దీంతో చింతపల్లి మండలం ఇంజమూరు గ్రామానికి చెందిన పోల్ గిరి,  రత్నాల వెంకటేష్ లతో కలిసి హత్య చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. బాలకృష్ణ అంతటితో ఆగకుండా మరోసారి హైదరాబాద్ లో ప్లంబర్లు గా పనిచేస్తున్న యూసుఫ్ తో కలిసి పథకం వేసి రూ.12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.  ఈసారి రూ. ఐదు లక్షలు  సుపారీ ఇచ్చాడు. యూసుఫ్  తన  స్నేహితుడు జహంగీర్  పాష, ఆసిఫ్ ఖాన్ లు కలిసి అప్పటికే బీహార్లో పిస్టల్ కొనుగోలు చేసుకుని ఉన్న అబ్దుల్ రెహమాన్ తో కలిసి ఈ నెల 4న స్వామిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. వీరిలో యూసుఫ్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

click me!