జగన్మోహన్ రెడ్డి అనధికారికంగా ఒక సాఫ్ట్ వేర్ కొన్నాడు.. ఆధారాలున్నాయి.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Published : Mar 19, 2022, 10:22 AM IST
జగన్మోహన్ రెడ్డి అనధికారికంగా ఒక సాఫ్ట్ వేర్ కొన్నాడు.. ఆధారాలున్నాయి.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

సారాంశం

పెగాసస్ సాఫ్ట్ వేర్ ఆరోపణలపై తాము స్పందించాల్సిన పనేలేదు. నిజంగా చంద్రబాబుగారు తప్పుచేసిఉంటే, అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిగానీ, కేంద్రప్రభుత్వం గానీ ఊరుకుంటాయా? పెగాసస్ సాఫ్ట్ వేర్ ఆరోపణలపై సుప్రీంకోర్టు వేసిన కమిటీ వాస్తవాలు తేలుస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 

విజయవాడ్ : చంద్రబాబు మీద మమతాబెనర్జీ pegasus spyware ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేగింది. ఈ సందర్భంగా టీడీపీ నేత Somireddy Chandramohan Reddy విలేకరుల సమావేశం నిర్వహించారు. 
Mamata Banerjeeతో Prashant Kishore కావాలనే చంద్రబాబుపై ఆరోపణలు చేయించాడనేది వాస్తవం అన్నారు. ప్రశాంత్ కిషోర్ రాజకీయాలన్నీ దుష్ప్రచారాలతో కూడుకున్నవేనని.. టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు రూ.6లక్షలకోట్ల అవినీతి చేశారని జగన్మోహన్ రెడ్డితో పీకేప్రచారం చేయించాడు. జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా రూపాయి అవినీతిని కూడా నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు.

 కేంద్రప్రభుత్వం అనుమతి లేకుండా ఏరాష్ట్రం కూడా విదేశాలతో సంబంధాలు పెట్టుకొని ఏదిపడితే అదిచేయడానికి వీల్లేదు. అది  చట్టవ్యతిరేకంకూడా అన్నారు. కేంద్రప్రభుత్వం అనుమతి లేకుండా రాష్ట్రప్రభుత్వాలు నేరుగా ఇతర దేశాలతో వ్యాపారకార్యకలాపాలు నిర్వహించడమనేది అసాధ్యమని, పెగాసస్ సాఫ్ట్ వేర్ ను గతంలో ఎప్పుడో చంద్రబాబు కొన్నారన్న అధికారపార్టీవ్యాఖ్యలు పచ్చిఅబద్ధాలు, అవాస్తవాలేనని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తేల్చిచెప్పారు. 

గతంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ కు సంబంధించి నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి ఆగస్ట్ 2021న ఆర్ టీఐ సమాచారం కింద, సదరు సాఫ్ట్ వేర్ కొనిఉంటే, దానికి సంబంధించిన వివరాలు తనకు తెలియ చేయాలని స్వయంగా డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను కోరాడు. దానికి ఆయన చాలా స్పష్టంగా సమాధానమిస్తూ, అలాంటి సాఫ్ట్ వేర్ ఏదీ ఏపీ రాష్ట్రం కొనుగోలు చేయలేదని, చేశారనడానికి కూడా ఎలాంటి ఆధారాలులేవని నాగేంద్రప్రసాద్ కు సమాధానమిచ్చారు.   
        
పెగాసస్ సాఫ్ట్ వేర్ అంశాన్ని తెరపైకి తెచ్చిన వైసీపీవారికి రాష్ట్రప్రభుత్వాల పరిధేమిటో,వాటివిధులేమిటో కూడా తెలియక పోవడం కనీస జ్ఞానంలేకుండా మాట్లాడటం సిగ్గుచేటు. రాష్ట్రప్రభుత్వాలు రుణాలు తీసుకోవాలన్నా ఆఖరికి కేంద్రాన్ని సంప్ర దించాల్సిందే. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి పెగా సస్ సాఫ్ట్ వేర్ పై అవగాహనలేకపోవచ్చు. ఎవరో కొందరుపీకేలు.. కేకేలు కావాలనే రాష్ట్రప్రభుత్వంపై ప్రజల్లో నానాటి కీ పెరిగిపోతున్న వ్యతిరేకతనుంచి ప్రజలదృష్టిని మళ్లించడానికి తెరపైకి తెచ్చినఅంశం కావచ్చు. టీడీపీఎమ్మెల్సీ బీ.టెక్. రవిచెప్పినట్టుగా పెగాసస్ సాఫ్ట్ వేర్ చంద్రబాబు కొనిఉంటే, తాము నిజంగానే వివేకానందరెడ్డి హత్య జరగకుండా చూసేవాళ్లం కదా.. అన్నారు.

మోదీప్రభుత్వంపై పెగాసస్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా నిజనిర్థారణకు ఒక కమిటీని వేసింది. ఆ కమిటీనే అసలు వాస్తవాలు తేలుస్తుంది. మోదీప్రభుత్వం నిజంగా పెగాసస్ సాఫ్ట్ వేర్ కొన్నదో లేదో..త్వరలోనే సదరుకమిటీ తేలుస్తుంది. పెగాసస్ సాఫ్ట్ వేర్ చంద్రబాబు కొన్నారన్న ఆరోపణలు హాస్యాస్పద మైనవితప్ప, అసలైనవికావు. చంద్రబాబుగారు ఎలాంటినాయకులో ప్రపంచమంతా తెలుసు. ఆయనపై ఎలాంటి ఆరోపణలు, కేసులు, అవినీతిమరకలు లేవు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ..అలా ఉన్న నిజాయితీపరుడు, నీతిమంతుడు చంద్రబాబు ఒక్కడే. అధికారంకోసం ఏదిపడితే అదిమాట్లడడు...అబద్ధాలు చెప్పడని రాజకీయాలగురించి అవగాహన ఉన్నవారందరికీ తెలుసు. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కూడా మాట్లాడుతూ, చంద్రబాబు గారి హాయాంలో ఉమ్మడిరాష్ట్రంలో మతకలహాలు.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూశారన్నారు. చంద్రబాబు గారిలాంటి నాయకుడు ఇల్లీగల్ అంశమైన పెగాసస్ సాఫ్ట్ వేర్ ను నమ్ముకునే వ్యక్తికాదు. కేంద్రప్రభుత్వంకూడా పెగా సస్ జోలికిపోయిందో...లేదో సుప్రీంకోర్టుకమిటీనే త్వరలో తేలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ (పీకే) అనేవ్యక్తిగతంలో తమప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు కూడా 6లక్షలకోట్ల అవినీతిజరిగిందని దుష్ప్రచారం చేశాడు. 

మంచిపరిపాలనను కూడా ఘోరంగా చిత్రీకరించాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా రూపాయి అవినీతిని అయినా నిరూపించారా? టీడీపీని, చంద్రబాబుని ఏం పీకారు? బాబుగారు, లోకేశ్ లపై చేయాల్సిన దుష్ప్రచారమంతా చేసింది పీకేనే. ప్రజల్ని మిస్ లీడ్ చేసి, తాను అనుకున్నది నెరవేర్చిన పీకే, అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాడు. నీతిమాలినవిధమైన చర్యలకు పాల్పడుతూ, జరగనిదాన్ని జరిగినట్లు చిత్రీకరించడంలో ప్రశాంత్ కిషోర్ నిష్ణాతుడు. అదే పీకే ఇప్పుడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రివద్ద పనిచేస్తున్నాడు. అతనే ఆమెను తప్పుదారి పట్టించిఉండవచ్చని తాము అనుకుంటున్నామన్నారు. 

జగన్మోహన్ రెడ్డి గతంలోఆడిన కోడి కత్తి డ్రామాను, సొంతబాబాయ్ హత్యనుకూడా పీకే చంద్రబాబు గారికే ఆపాదించాలని చూశాడు. మమతాబెనర్జీనికూడా వీల్ ఛైర్లో కూర్చోబెట్టితిప్పి, ఎన్నికలయ్యాక లేపికూర్చోబెట్టాడు. మమతా బెనర్జీతో పీకేనే చంద్రబాబుగారి గురించి మాట్లాడించాడు అనడంలో ఎలాంటిసందేహంలేదు. పీకే చేసిన పనికిమాలిన ఆరోపణలకు ఆలూచూలూ లేదు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరంకూడా మాకులేదు. తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రహక్కులు, ప్రయోజనాల కోసం మోదీప్రభుత్వాన్నిఎదిరించి పోరాడాం. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది మోదీ అయితే, ఇక్కడ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి. నిజంగా మేం తప్పుచేసుంటే, ఆధారాలతో బయటపెట్టి, మమ్మల్నిశిక్షించవచ్చుకదా? అని ప్రశ్నించారు.

చంద్రబాబుగారు ముఖ్య మంత్రిగా ఉన్నంతకాలం ప్రజలకోసం ఆలోచించి, రాష్ట్రబాగుకోసం పనిచేశారుతప్ప, ఇలాంటి వాటికి ఎక్కడాఎప్పుడూ ఆస్కారమిచ్చి నవ్యక్తికాదు. రాష్ట్రప్రభుత్వం నిజంగా పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనిఉంటే, అధికారులకు తెలియకుండా ఉంటుందా? డీజీపీగా పనిచేసిన సవాంగ్ ఆర్ టీఐ సమాచారం కింద ఏమీలేదని ఎందుకు చెబుతారు? ఈప్రభుత్వంపై ఫోన్లు ట్యాప్ చేస్తుందనే అభియోగాలు వచ్చాయి. కొందరు అధికారులు, టీడీపీనేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారన్న సమాచారం మావద్ద ఉంది. దానికి సంబంధించి తనపార్టీ తరుపున జగన్మోహన్ రెడ్డి అనధికారికంగా ఒక సాఫ్ట్ వేర్ కొన్నాడని ఇప్పటికీచెప్పగలం. దాన్నిమేం నమ్ముతున్నాంకూడా అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu