గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్ దొరికినా వెంటాడుతున్న అనుమానాలు.. ఎందుకంటే..

Published : Mar 19, 2022, 09:58 AM IST
గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్ దొరికినా వెంటాడుతున్న అనుమానాలు.. ఎందుకంటే..

సారాంశం

తాను సరిగా చదవలేకపోతున్నానంటూ అందుకే మనస్తాపంతో చచ్చిపోతున్నానని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టింది. అయితే అనుమానాలు అక్కడే మొదలయ్యాయి.   

కడప : మండల పరిధిలోని ఎర్రగుంట్ల సమీపంలో ఉన్న Balayogi Gurukul School విద్యార్థి రెడ్డి అమృత (15) విష ద్రావణం తాగి Suicideకు పాల్పడింది. ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. రాయచోటి మండలం అబ్బవరం గ్రామం పొదలపల్లెకు చెందిన చంద్రమోహన్, విజయవాణి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరి పెద్దకుమార్తె రెడ్డి అమృత బాలయోగి గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం exam రాసి హాస్టల్ కి వెళ్ళిన విద్యార్థిని మధ్యాహ్నం భోజనానికి రాలేదు.

ఇది ఆలస్యంగా గమనించినఉపాధ్యాయులు అమృత రూమ్ కి వెళ్లి చూడగా Toxic solution తాగినట్లు గుర్తించారు. వెంటనే హుటాహుటిన రాయచోటి ప్రభుత్వాసుపత్రికి.. అక్కడినుంచి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున అమృత మృతి చెందింది. అయితే బుధవారం విషం తాగితే ప్రిన్సిపాల్ పోలీసులకు అప్పుడే ఫిర్యాదు చేయకుండా.. విద్యార్థిని చనిపోయిన తర్వాత శుక్రవారం సంబేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థిని సరిగా చదవలేక పోతున్నాను అంటూ రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది.

తమ కుమార్తె గణితం, సైన్సు సరిగా చదవలేక ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా విద్యార్థిని మృతి విషయం తెలియగానే డీసీవో సంతోషమ్మ గురుకుల పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలపై ఆరా తీశారు. విద్యార్థిని విషద్రావణం తాగిన వెంటనే  పోలీసులకు, తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయకపోవడం తప్పే అన్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. 

ఇదిలా ఉండగా, జనవరి 8న ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో చోటు చేసుకుంది. Warangal నగరంలోని Rohini Hospital హాస్టళ్లో నర్సింగ్ విద్యార్థిని suicide attempt చేసింది. హాస్టళ్లోనే విద్యార్థిని ఉరి వేసుకున్నట్లు సమాచారం. గమనించిన యాజమాన్యం విద్యార్థినిని రోహిణి ఆస్పత్రికి తరలించింది. సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. Nursing student  ఆత్మహత్యాయత్నంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హాస్టల్ లో ఏం జరిగిందని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిణి ఆస్పత్రి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. 

కాగా, తెలంగాణలోని Karimnagar జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మానకొండూరు మండలం చెంజర్ల గ్రామ శివారులో గల గుట్టలో Young woman brutally murderకు గురైంది. యువతి dead bodyని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

కాగా యువతి హత్యకు love affair కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన విధానం, అనుమానితులను బట్టి... కాగా ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాల మీద పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు ప్రేమ వ్యవహారమా? మరేదైనా కారణం ఉందా? అనే యాంగిల్ లో విచారణ కొనసాగుతోంది.

PREV
click me!

Recommended Stories

RK Roja Comments: దొంగ కేసులు పెడుతున్నారు.. అందుకే ఇలాంటి వారు చాలా అవసరం | Asianet News Telugu
Vanjangi Hills : మేఘాలు తాకే కొండలపైనుండి సూర్యోదయం... వంద సిమ్లాలు, వెయ్యి ఊటీలను మించిన సీన్