విశాఖలో భూ కుంభకోణం: సిట్ దర్యాప్తు తిరిగి ప్రారంభం

By narsimha lodeFirst Published Oct 18, 2020, 1:45 PM IST
Highlights

 టీడీపీ హయంలో విశాఖపట్టణంలో నమోదైన భూ కుంభకోణాలపై విచారణకు నియమించిన సిట్ విచారణను ప్రారంభించింది. కరోనాతో ఈ ఏడాది మార్చిలో విచారణ నిలిచిపోయింది.  రాష్ట్రంలో ఇటీవల కాలంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. దీంతో విచారణను ప్రారంభించారు.


విశాఖపట్టణం: టీడీపీ హయంలో విశాఖపట్టణంలో నమోదైన భూ కుంభకోణాలపై విచారణకు నియమించిన సిట్ విచారణను ప్రారంభించింది. కరోనాతో ఈ ఏడాది మార్చిలో విచారణ నిలిచిపోయింది.  రాష్ట్రంలో ఇటీవల కాలంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. దీంతో విచారణను ప్రారంభించారు.

సిట్ చైర్మెన్ డాక్టర్ విజయ్ కుమార్  కమిటీతో భేటీ అయ్యారు.శనివారం నాడు ఆయన  విశాఖపట్టణానికి చేరుకొన్నారు.సర్క్యూట్ హౌస్ లో సభ్యులు వైవీ అనురాధ, భాస్కరరావులతో చర్చించారు. సిట్ ఇప్పటికే మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 

రెండు మూడు నెలల్లోనే విచారణను పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడానికి సిట్ రంగం సిద్దం చేసింది. గతంలో సిట్ వద్ద పనిచేసిన అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వారి స్థానంలో  కొత్తవారిని నియమించనున్నారు. ఈ మేరకు సిట్ అధికారులు ప్రభుత్వానికి అవసరమైన సిబ్బంది కోసం ప్రభుత్వాన్ని కోరారు.

ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో  విశాఖపట్టణంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగిందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఆరోపణలు చేసింది.ఈ విషయమై చంద్రబాబునాయుడు సర్కార్ కూడ సిట్ ను ఏర్పాటు చేసింది. 

జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత 2019 అక్టోబర్ మాసంలో ప్రభుత్వం సిట్ ను నియమించింది. ఈ కుంభకోణానికి సంబంధించి పలువురి నుండి ఫిర్యాదులను ప్రభుత్వం స్వీకరించింది. జిల్లాలోని  13  మండలాల్లో భూ కుంభకోణాలు జరిగినట్టుగా సిట్ బృందం అనుమానిస్తోంది.

విశాఖ రూరల్, సీతమ్మధార, గాజువాక, పెదగంట్యాడ, సబ్బవరం, పరవాడ, పెందుర్తి, భీమిలీ, మహారాణిపేట, ములగాడ, గోపాలపట్నం తదితర ప్రాంతాల్లో  భూ అక్రమణలు జరిగాయని ఆరోపణలు రావడంతో సిట్ విచారణ చేస్తోంది.

click me!