ఏపీలో బీసీ కార్పోరేషన్ పాలకమండళ్ల నియామకం: కొత్త ఛైర్మెన్లు వీరే...

By narsimha lodeFirst Published Oct 18, 2020, 12:22 PM IST
Highlights

బీసీ కార్పోరేషన్లకు ఏపీ ప్రభుత్వం పాలకమండళ్లను ప్రకటించింది. 30 వేలపైబడిన జనాభా ఉన్న బీసీ కులాలకు కార్పోరేషన్లలో ప్రాతినిథ్యం కల్పించారు. 

అమరావతి: బీసీ కార్పోరేషన్లకు ఏపీ ప్రభుత్వం పాలకమండళ్లను ప్రకటించింది. 30 వేలపైబడిన జనాభా ఉన్న బీసీ కులాలకు కార్పోరేషన్లలో ప్రాతినిథ్యం కల్పించారు. 

ఆదివారం నాడు ఏపీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, శంకరనారాయణ మంత్రులు బొత్స సత్యనారాయణ, వేణుగోపాల్,  ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు మీడియా సమావేశంలో ఛైర్మెన్ల జాబితాను విడుదల చేశారు.

ఈ కమిటీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. 56 చైర్మెన్ పదవులతో పాటు 672 డైరెక్టర్లకు నియమించారు. 728 బీసీలకు నామినేటేడ్  పదవులు దక్కాయి.139 కులాలకు 56 కార్పోరేషన్లను ఏర్పాటు చేశారు.

బీసీ కార్పోరేషన్లు, ఛైర్మెన్లు వీరే

ముదిరాజ్- కోమా వెంకటనారాయణ
జంగం- వలివేటి ప్రసన్న
బొందిలి- ఎస్.కిషోర్ సింగ్
ముస్లిం సంచారజాతులు-  సయ్యద్ అసిఫ్
చెత్తదాసరి వైష్ణవ- టి. మనోజ్ కుమార్
ఆరెకటిక-  దాదాకుమారలక్ష్మి
దేవాంగ-  బి. సురేంద్రబాబు
మేదర- కేత లలిత నాంచారమ్మ
కళింగ-  పేరాడ తిలక్
కళింగకొమ్మాటి- అందవరపు సూరిబాబు
రెడ్డిక- దుక్కా లోకేశ్వరరావు
పొలనాటి వెలమ - పి. కృష్ణవేణి
కూరాకుల కొండార -  రాజపు హైమావతి
అతిరాస- భాస్కరరావు
రజక-  సుగమంచిపల్లి రంగమ్మ
కురుబ/ కురుమ- కోలి సూర్యప్రకాష్ బాబు
తొగుట-  గడ్డం సునీత
కుంచిలి ఒక్కలిగా-  బి. నళిని
వన్యకులక్షేత్ర- కె.వనిత
పాల ఏకారి- తరిగొండ మురళీధర్
శ్రీశయన - చేపూరి రాణి
ముదలియార్- తిరుపత్తూరు గోవిందరాజన్ సురేష్
ఈడిగ- కె. శాంతి

రజక-ఎస్. రాగన్న
గండ్ల/తెలికుల-ఎస్. భవానీ ప్రియ
పెరిక-శ్రీమతి పురుషోత్తం గంగ భవానీ
అగ్నికులక్షత్రియ- భవానీ ప్రియ
అయ్యారిక-అవాల రాజేశ్వరీ
వడ్డెర-ఎన్.హరీష్ కుమార్
నాయీబ్రహ్మణ -ఎస్.యానాదయ్య
పద్మశాలి-శ్రీమతి జింకా విజయలక్ష్మి

దూదేకుల-అస్పరి ఫక్రూబి
సగర- జి. రమణమ్మ
విశ్వబ్రహ్మణ- తొల్లేటి శ్రీకాంత్
గౌడ- మధు శివరామకృష్ణ
వద్దెలు- శ్రీమతి సైదు గాయత్రి సంతోష్
భాతరాజ- శ్రీమతి కురుపాటి గీతాంజలిదేవి
వాల్మీకి/బోయ - డాక్టర్. ఎ. మధుసూధన్
కుర్నీ-శ్రీమతి బూటా శారదమ్మ
వీరశైవలింగాయత్ - వై. రుద్రాగౌడ్
బెస్త -తెలుగు సుధారాణి


 

 

 

click me!