విజయవాడ కొండమీద నైట్ సఫారి

Published : Feb 21, 2017, 11:24 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
విజయవాడ కొండమీద నైట్ సఫారి

సారాంశం

సింగపూర్ లా తయారుకానున్న విజయవాడ

విజయవాడలోని ఓ కొండ మీద  నైట్ సఫారీకి  ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందని అనే అలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వచ్చింది.  అపుడువిజయవాడ సింగపూర్ తరహాలో టూరిజం కేంద్రంగా తయారువుతుంది. అందువల్ల ఒక కొండమీద  నైట్ సఫారి గాఅభివృద్ఢి చేసే  అంశాన్ని పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీని మీద తొందరగా ఒక  నివేదిక అందజేయాలని అధికారులను సూచనలిచ్చారు.

 

కొల్లేరు సరస్సును రాష్ట్రంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు వారంలోగా పొందేలా కార్యాచరణ రూపొందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

మంగళవారం వెలగడపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో  ఏపీ స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ మూడవ  సమీక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు టూరిజం గురించిన ఎన్నో ఆదేశాలు జారీ చేశారు. అవి :

 

 ఎర్రచందనం అక్రమ రవాణాను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దు, దీనికి అడ్డుకట్ట వేసేందుకు అరికట్టడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.

  అలాగే రాష్ట్రంలోని పక్షి సంరక్షణ కేంద్రాలను, జింకలు, ఎలుగుబంటుల పార్కులను మరింత అభివృద్ధి చేసి, ఆకర్షణీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

దేశంలోనే పెద్దదైన పులుల సంరక్షణ కేంద్రం మన రాష్టంలోనే వుందని దానిని టూరిస్ట్ స్పాట్‌గా మార్చాలంటే దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను అనుమతించాల్సి వుంటుదన్నారు. ఇందుకోసం అధికారులు కృషి చేయాలని చెప్పారు.

 

  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నగర వనాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు.

 

అడవుల్లో పెద్దఎత్తున చెక్ డ్యాంలు నిర్మించి అటవీ  విస్తీర్ణం పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పారు.

 

రాష్ట్రంలో ఎవరు మొక్కలు పెంచేందుకు ముందుకొచ్చినా, అడిగిన వెంటనే అందించే విధంగా ట్రీ బ్యాంకు ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఆన్‌లైన్‌లో కూడా మొక్కలు అందించడానికి అటవీ శాఖ సిద్ధంగా ఉండాలని అన్నారు. తీర ప్రాంతంలో మామిడి తోటల పెంపకం చేపట్టాలని చెప్పారు.

 

ఈవిషయాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.

 

PREV
click me!

Recommended Stories

Palle Panduga: గ్రామాల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.11,085 కోట్ల పనులకు శ్రీకారం
ఉదయగిరిలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Palle Panduga 3.0 | Pawan Kalyan | Asianet News Telugu