జగ్గంపేటలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి కీలక నేత

By Asianet NewsFirst Published Feb 6, 2023, 12:49 PM IST
Highlights

జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా ఉన్న ఓ నేత వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల సమయంలో ఆ నేత ఎమ్మెల్యే గెలుపులో కీలక పాత్ర పోషించారని టాక్ ఉంది. 

వైసీపీలో గత కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లా వైసీపీలో పరిణామాల కలకలం రేపుతుండగా.. మరికొన్ని చోట్ల కూడా పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి.  జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు ఆయన ముఖ్య అనుచరుడు వైబోగుల శ్రీనివాస్ షాక్ ఇచ్చారు. శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరారు. జ్యోతుల నెహ్రు, నవీన్ కుమార్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. జగ్గంపేటలో శ్రీనివాస్ కీలకంగా ఉన్నారని.. ఎమ్మెల్యేగా జ్యోతుల చంటిబాబు విజయంలో కీలక పాత్ర పోషించారనే ప్రచారం కూడా ఉంది. 

అమరావతిపై ఏపీ ప్రభుత్వం పిటిషన్: ఈ నెల 23న విచారించనున్న సుప్రీంకోర్టు

శ్రీనివాస్ టీడీపీలోకి వెళ్లడం.. జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీకి ఇబ్బందేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ప్రభావం ఏమేరకు ఉంటుందనేది రానున్న ఎన్నికల ఫలితాల తర్వాత తెలియనుంది. ఇక, పార్టీలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, పలుచోట్ల సర్పంచ్‌లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తూ ఉండటంతో కొన్నిచోట్ల క్షేత్ర స్థాయిలో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురువుతున్నాయనే మాట వినిపిస్తోంది.

అప్పుడు బాదుడేబాదుడు అన్నారు.. ఇప్పుడు గుంజుడేగుంజుడు ప్రారంభించారు: వైసీపీపై యామినీ శర్మ ఫైర్

ఇక, కాకినాడలో గొల్లప్రోలు మండలం కొడవలిలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పలువురు టీడీపీలో చేరారు. వైసీపీకి చెందిన దాదాపు 50 మంది వరకు టీడీపీ కండువా కప్పుకున్నారు.
 

click me!