రేపటి నుండి నంద్యాలలో చిందులే..

Published : Aug 02, 2017, 02:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
రేపటి నుండి నంద్యాలలో చిందులే..

సారాంశం

లోకల్ లీడర్ల వల్లే తాను పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. రెండు సంవత్సరాలు జిల్లా పార్టీకి అధ్యక్షునిగా చేసిన తనను పార్టీ స్ధానిక నేతలు బాగా అవమానాలకు గురిచేసారని మండిపడ్డారు. మంత్రి అఖిలప్రియ తన ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. చిన్నా, పెద్దా లేకుండానే అఖిల మాట్లాడటాన్ని చక్రపాణి అభ్యంతరం వ్యక్తం చేసారు.

టిడిపికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి అందుకు కారణాలు చెప్పారు. పార్టీని వదిలేయాల్సిన కారణాలను ఆవేధనతో వివరించారు. లోకల్ లీడర్ల వల్లే తాను పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. రెండు సంవత్సరాలు జిల్లా పార్టీకి అధ్యక్షునిగా చేసిన తనను పార్టీ స్ధానిక నేతలు బాగా అవమానాలకు గురిచేసారని మండిపడ్డారు. మంత్రి అఖిలప్రియ తన ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. చిన్నా, పెద్దా లేకుండానే అఖిల మాట్లాడటాన్ని చక్రపాణి అభ్యంతరం వ్యక్తం చేసారు. తన ఇష్టం వచ్చినట్లు, అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నఅఖిలపై మండిపడ్డారు. ఒకపుడు చిరంజీవిని, తర్వాత జగన్ను కొంపముచి ఇపుడు చంద్రబాబునాయుడు దగ్గర చేరారంటూ భూమా కుటుంబాన్నిఎద్దేవా చేసారు.

పెళ్ళి చేసుకున్న పార్టీ ఏమో దెయ్యంగా కనిపిస్తోందని, ప్రియురాలేమో దేవతగా కనిపిస్తోందంటూ అఖిలను ఎద్దేవా చేసారు. వైసీపీకి చెందిన ఐదుమంది ఎంఎల్ఏను టిడిపి కొనుగోలు చేసినట్లు ఆరోపించారు. అఖిలప్రియ మీద కూడా తాను నోరువిప్పుతానన్నారు. డబ్బులకు అమ్ముడుపోయిన ఎంఎల్ఏలు కూడా తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారా అంటూ నిలదీసారు. నంద్యాలకు వచ్చిన చంద్రబాబునాయుడు తనను పక్కన బెట్టుకునే మిగిలిన వాళ్లతో మాట్లాడినపుడు తాను చాలా బాధపడ్డానన్నారు.

తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి వెళ్లిపోయిన తర్వాత తనను టిడిపిలో బాగా అవమానానికి గురిచేసినట్లు ఆరోపించారు. ఫరూక్ 100 మందిని పెట్టుకుని తమపై దుష్ర్పచారం చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో తానేంటో టిడిపికి చూపిస్తానంటూ సవాలు విసిరారు. పనిలో పనిగా తన సోదరుడు మంచి మెజారిటీతో గెలుస్తారని జోస్యం కూడా చెప్పారులేండి. తామిద్దరమూ కలిసుంటేనే బాగుంటుందని కూడా చక్రపాణి అభిప్రాయపడ్డారు. రేపటినుండి నంద్యాలలో చిందేయాల్సిందే అంటూ ప్రకటించారు. అక్టోబర్(ఆగస్టు) సంక్షోభం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో అంటూ సస్పెన్స్ కు తెరలేపారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్