‘నాకు సహకరిస్తే..ప్రమోషన్ ఇప్పిస్తా.. లేదంటే అంతుచూస్తా..’ అంగన్ వాడీ ఆయాకు వైసీపీ నేత కుమారుడి బెదిరింపు...

Published : Mar 18, 2022, 12:17 PM IST
‘నాకు సహకరిస్తే..ప్రమోషన్ ఇప్పిస్తా.. లేదంటే అంతుచూస్తా..’ అంగన్ వాడీ ఆయాకు వైసీపీ నేత కుమారుడి బెదిరింపు...

సారాంశం

ఓ అంగన్ వాడీ ఆయా మీద అధికార పార్టీ నాయకుడి కొడుకు బెదిరింపులకు పాల్పడ్డాడు. తన కోరిక తీర్చాలంటూ వెంటపడ్డాడు. అలా చేస్తే ప్రమోషన్ ఇప్పిస్తానని ప్రలోభపెట్టజూశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో అంతు చూస్తానంటూ బెదిరించాడు. 

యడ్లపాడు : ‘చేస్తున్న ఉద్యోగం స్థాయి పెంచి Posting ఇప్పిస్తా... నాకు సహకరిస్తే సరి.. లేకపోతే ఉన్న ఉద్యోగమూ లేకుండా చేస్తా’ అని ఓ Anganwadi ఆయాను Ruling party నేత కుమారుడు బెదిరించిన వైనం ఇది. బాధితురాలి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని ఓ ప్రజాప్రతినిధి కుమారుడు బుధవారం బాధితురాలు పని చేస్తున్న కోటికి వచ్చాడు. తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పదోన్నతి కల్పిస్తానని, తనకు సహకరించాలని ఆమెతో వంకరగా మాట్లాడాడు. అతడి దురుద్దేశాన్ని గుర్తించిన ఆమె అందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన అతడు నీ సంగతి తర్వాత చూస్తానంటూ బెదిరించి వెళ్లాడు. బాధితురాలు గురువారం తనపై అధికారికి ఫిర్యాదు చేసింది. 

ఇదిలా ఉండగా, ఓరాజకీయపార్టీకి చెందిన నాయకుడు minar girlపై లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన హైదరాబాద్లో జరిగింది. బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13ఏళ్ల బాలికపై జాంబాగ్ కు చెందిన మజ్లీస్ నాయకుడు రఫిక్ rape attemptకి పాల్పడ్డాడు. పటేల్ నగర్ లోని బాలాజీ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లో ఉండే రఫీక్ బాలికను భయపెట్టి తన ఇంట్లోనే లైంగికదాడికి యత్నించాడంతో ఆమె కేకలు వేసింది. కుటుంబసభ్యులకు బాలిక విషయం తెలపడంతో రఫిక్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. Pocso act కింద కేసు నమోదు చేసిన బేగంబజార్ పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రఫిక్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేశారు. 

కాగా, ఫిబ్రవరి చివర్లో నిర్మల్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అభంశుభం తెలియని ఓ బాలికపై rapeకి ఒడిగట్టాడు. ఈ ఘాతుకాన్ని  గోప్యంగా పెట్టే ప్రయత్నం చేశాడు. victim తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. Nirmal డిఎస్పి ఉపేందర్ రెడ్డి కథనం ప్రకారం…నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్ పేటకు చెందిన టిఆర్ఎస్ నేత షేక్ సాజిద్  స్థానిక వార్డు నుంచి కౌన్సిలర్ గా ఎన్నికై… చిన్నవయసులోనే వైస్ చైర్మన్ పదవిని చేపట్టాడు.  ఇటీవల ఓ పూజా కార్యక్రమానికి హాజరైన sajid…అక్కడ ఓ 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు. అంతే ఆ బాలికను  శారీరకంగా లొంగదీసుకునేందుకు అన్నపూర్ణమ్మ అనే మహిళను రంగంలోకి దింపాడు. 

అన్నపూర్ణమ్మ ఆ బాలికను నమ్మించి నిజామాబాద్ వరకు వెళ్లాలి తోడు రమ్మంటూ వెంటబెట్టుకుని వెళ్ళింది. ఆ తర్వాత ‘హైదరాబాదులో ఓ దావత్ ఉంది అక్కడికి వెళుతున్నా.. ఇక్కడిలా కాదు.. అక్కడ గ్రాండ్ గా ఉంటుంది ఫంక్షన్..  నువ్వు కూడా రావచ్చు కదా?’  అంటూ ఆఫర్ ఇచ్చింది. సాయంత్రానికి తిరిగి వచ్చేయొచ్చని.. కారులోనే వెళ్దామని చెప్పింది. దీంతో తెలిసిన మహిళా కదా అని ఆ బాలిక సరే అని చెప్పింది. ఆ తర్వాత ఆ మహిళ ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. కాసేపటికి ఒక కారు వచ్చింది. డ్రైవర్, అన్నపూర్ణతో కలిసి ఆ బాలిక కారులో బయలుదేరింది. చార్మినార్ సమీపంలోని ఓ లాడ్జిలో అప్పటికే బస చేసిన వైస్ చైర్మన్ షేక్ సాజిద్ కు ఆ బాలికను అప్పగించింది. అతను ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను బెదిరించి, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్