విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పేలుడు సంభవించింది. స్టీల్ మెల్టింగ్ షాప్-2 లిక్విడ్ స్టీల్ పేలింది. ఈ ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.