కులం పేరుతో దూషించారని ఫిర్యాదు.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..

Published : Feb 11, 2023, 10:29 AM IST
కులం పేరుతో దూషించారని ఫిర్యాదు.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..

సారాంశం

తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోంది. 

తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌ రెడ్డి‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోంది. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పెన్నానది సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం ధర్నాకు దిగారు. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకపోయినప్పటికీ వైసీపీ నేతలు పెన్నానది  నుంచి వందల లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అయితే ఇసుక రీచ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి కూలం పేరుతో దూషించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పెద్దపప్పూరు పోలీసు స్టేషన్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 

ఇదిలా ఉంటే.. పెద్దపప్పూరు పెన్నానది సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అధికారులు నిబంధనలు పాటించకుండా వైసీపీ నేతలకు కాసులు వర్షం కురిపించేలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. పెద్దపప్పూరు ఇసుక రీచ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అయితే పోలీసులు.. నిరసన విరమించుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి సూచించారు. అక్రమ ఇసుర రవాణాను అడ్డుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులకు, జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్