వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు లాయర్ సంచలన ఆరోపణలు చేశాడు. తన తల్లిని లైంగికంగా వేధించాడన్న కక్షతోనే సునీల్ యాదవ్ .. వివేకాను దారుణంగా హత్య చేశాడని న్యాయవాది తెలిపాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు లాయర్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వున్న సునీల్ యాదవే .. వివేకాను హత్య చేశాడని వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు లాయర్ కోర్టుకు వివరించారు. తన తల్లిని లైంగికంగా వేధించాడన్న కక్షతోనే సునీల్ యాదవ్ .. వివేకాను దారుణంగా హత్య చేశాడని న్యాయవాది తెలిపినట్లు ప్రముఖ తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.