చంద్రబాబు విదేశాల్లో 5 లక్షల కోట్లు దాచాడు.. బాలకృష్ణ మాట్లాడింది 6 నెలలైనా అర్థం కాదు: లక్ష్మీ పార్వతి

Published : Apr 11, 2023, 03:42 PM IST
చంద్రబాబు విదేశాల్లో 5 లక్షల కోట్లు దాచాడు.. బాలకృష్ణ మాట్లాడింది 6 నెలలైనా అర్థం కాదు: లక్ష్మీ పార్వతి

సారాంశం

తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకొస్తామని తెలుగు సంస్కృతం అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు.  రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు అకాడమీ, తెలుగు యునివర్సిటీలను పట్టించుకోలేదని విమర్శించారు.

తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకొస్తామని తెలుగు సంస్కృతం అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు.  రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు అకాడమీ, తెలుగు యునివర్సిటీలను పట్టించుకోలేదని విమర్శించారు. లక్ష్మీ పార్వతి ఈరోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో  తెలుగు, సంస్కృత అకాడమి తిరుపతి కేంద్రంగా ఏర్పడిందని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో సంస్కృత అకాడమీ ఉండటంతో ఏపీలో తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటు చేశామని తెలిపారు. .

తెలుగు అకాడమీ ద్వారా ఇప్పటివరకు ఇంటర్మీడియట్ పుస్తకాలు ముద్రించామని చెప్పారు. ఉన్నత విద్యా శాఖతో ఎంవోయూ కుదుర్చుకుని డిగ్రీ పుస్తకాలు కూడా ముద్రణ చేస్తామని తెలిపారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను ముద్రించ బోతున్నట్లు చెప్పారు. ఈ నెలలో ఉగాది పురస్కారాలు అందజేస్తామని అన్నారు. 

అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణలపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సైకో అని విమర్శించారు. ఆయన పాపాలు పండిపోయాయని అన్నారు. ఆయన విదేశాల్లో 5 లక్షల కోట్లు దాచి పెట్టారని ఆరోపించారు. ఈ నల్లధనం స్వదేశానికి తెప్పించాలని మోదీని కోరుతున్నట్టుగా చెప్పారు. టీడీపీ రోజురోజుకు దిగజారి పోతుందని విమర్శించారు. టీడీపీ సోషల్ మీడియాలో పనికి మాలిన వెధవలను పోషిస్తుందని.. మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 

లోకేష్‌ పాదయాత్ర కామెడీ సీన్‌‌లను తలపిస్తుందని విమర్శించారు.  బాలకృష్ణ ఏమి మాట్లాతారో తెలియదని.. ఆయన మాట్లాడి ఆరునెలలు అయినా అర్థం కాదని సెటైర్లు వేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!