విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో పాల్గొంటే ప్రైవేటీకరణను సమర్ధించినట్టే: కేసీఆర్ పై ఏపీ మంత్రి అమర్ నాథ్

By narsimha lodeFirst Published Apr 11, 2023, 3:49 PM IST
Highlights

 స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను  వ్యతిరేకించిన  బీఆర్ఎస్  పార్టీ  విశాఖ స్టీల్ ప్లాంట్  బిడ్డింగ్ లో  ఎలా  పాల్గొంటుందని  ఏపీ మంత్రి  అమర్ నాథ్  ప్రశ్నించారు. బిడ్డింగ్ లో  పాల్గొంటే  ప్రైవేటీకరణను సమర్ధించినట్టేనని  ఆయన  చెప్పారు. 


అమరావతి: విశాఖ స్టీల్  ప్లాంట్  బిడ్డింగ్ లో పాల్గొనే ముందు  ప్రైవేటీకరణకు వ్యతిరేకమా? అనుకూలమా అనే విషయాన్ని కేసీఆర్ సర్కార్ , బీఆర్ఎస్   స్పష్టం చేయాలని  ఏపీ  రాష్ట్ర  పరిశ్రమల శాఖ మంత్రి  గుడివాడ అమర్ నాథ్   డిమాండ్  చేశారు. 

మంగళవారంనాడు  ఏపీ  రాష్ట్ర మంత్రి  గుడివాడ అమర్ నాథ్  అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణకు  తాము వ్యతిరేకమని  కేసీఆర్  చేసిన  ప్రకటనను  మంత్రి అమర్ నాథ్  గుర్తు  చేశారు. ప్రైవేటీకరణను  వ్యతిరేకించిన  బీఆర్ఎస్ బిడ్డింగ్ లో  ఎలా  పాల్గొంటుందని  ఆయన  ప్రశ్నించారు.  బిడ్డింగ్ లో  పాల్గొంటే  ప్రైవేటీకరణను  సమర్ధించినట్టేనని  మంత్రి అమర్ నాథ్  చెప్పారు. విశాఖ స్టీల్  ప్లాంట్  ప్రైవేటీకరణను  వ్యతిరేకిస్తే  ప్రైవేటీకరణకు  వ్యతిరేకంగా  తమతో కలిసి రావాలని  ఆయన  డిమాండ్  చేశారు. 

విశాఖ స్టీల్  ప్లాంట్  పేరుతో  రాజకీయాలు  చేయవద్దని  మంత్రి అమర్ నాథ్  బీఆర్ఎస్  నేతలను  కోరారు. విశాఖ స్టీల్  ప్లాంట్  ప్రైవేటీకరణకు  వ్యతిరేకంగా సాగుతున్న  ఉద్యమానికి  తమ మద్దతు ఉందని మంత్రి  అమర్ నాథ్  గుర్తు  చేశారు. 

also read:విశాఖకు సింగరేణి అధికారులు: ఈఓఐ సాధ్యాసాధ్యాలపై పరిశీలన

రాజకీయ  కారణాలతోనే  మంత్రి  కేటీఆర్  వ్యాఖ్యలున్నాయని ఆయన  అభిప్రాయపడ్డారు.  విశాఖ స్టీల్  ప్లాంట్  బిడ్డింగ్ లో  పాల్గొనే అవకాశం  రాష్ట్ర ప్రభుత్వాలకు , రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు  లేదని ఆయన  గుర్తు  చేశారు..  బీఆర్ఎస్ ఆలోచనల వెనుక  రాజకీయ కారణాలున్నాయన్నారు. బీజేపీతో  ఉన్న విబేధాలతో  స్టీల్ ప్లాంట్  అంశాన్ని రాజకీయంగా వాడుకొనేందుకు  బీఆర్ఎస్  ప్రభుత్వం  చేస్తుందని  మంత్రి  ఆరోపించారు. 
 

click me!