
టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడుతో (chandrababu naidu) సినీనటుడు మోహన్ బాబు (mohan babu) భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరూ సమావేశమైనట్లుగా తెలుస్తోంది. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారనే దానిపై ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దశాబ్ధకాలంగా చంద్రబాబు- మోహన్ బాబు మధ్య గ్యాప్ వుంది. వీలు చిక్కినప్పుడల్లా వైసీపీకి మద్ధతుగా మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యేవారు మోహన్ బాబు. చంద్రబాబు పేరెత్తితే చాలు భగ్గుమనే పెదరాయుడు ఆయనతో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుంటానని ప్రకటించారు మోహన్ బాబు. ఇలాంటి పరిస్ధితుల్లో చంద్రబాబుతో భేటీ కావడం చూస్తుంటే.. మళ్లీ ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. వీరిద్దరి భేటీకి సంబంధించి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం రానుంది.