కేంద్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగాలంటూ ప్రచారం... ఏపీ వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ

Siva Kodati |  
Published : Jul 26, 2022, 04:17 PM IST
కేంద్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగాలంటూ ప్రచారం... ఏపీ వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ

సారాంశం

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. ఎలాంటి నోటిఫికేషన్ వెలువడలేదని.. ఇలాంటి ప్రచారాన్ని నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ (ministry of health and family welfare) పేరుతో పలు ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ చేపడుతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ (ap healh department) స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ జె నివాస్ వెల్లడించారు. ఉద్యోగాల నియామకానికి ఎం.డి , నేషనల్ హెల్త్ మిషన్ ఏపీ తరఫున ఎటువంటి నోటిఫికేషనూ ఇవ్వలేదని నివాస్ స్పష్టం చేశారు. ఇలాంటి ప్రచారాన్ని నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని ఆయన సూచించారు.

ఆయుష్మాన్ భారత్ కింద ఎంఎల్ హెచ్ పి , మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ , ఫార్మాసిస్ట్ పోస్టులకు ఏపీలో  నియామకాలు చేపడుతున్నట్టు ఫేక్ లెట‌ర్లను తయారు చేశారని నివాస్ తెలిపారు. ఫేక్ లెటర్లు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమీషనర్ స్పష్టం చేశారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఎలాంటి రిక్రూట్‌మెంట్ చేపట్టినా పేపర్ నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తామని ఆయన వివరించారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ లెటర్లను చూసి మోసపోవద్దని నివాస్ స్పష్టం చేశారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?