India Pakistan War ; నెల్లూరు రైల్వే స్టేషన్‌లో సెక్యూరిటీ డ్రిల్.. భద్రతా బలగాల అలర్ట్

Google News Follow Us

సారాంశం

ఇండియా-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో నెల్లూరు రైల్వే స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్, జీఆర్పీ, పోలీసులు భద్రతా తనిఖీలు నిర్వహించారు.

India Pakistan : భారత్-పాకిస్థాన్ మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఉగ్రవాదుల ఏరివేతకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇక గతరాత్రి ఇరుదేశాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. పాకిస్థాన్ మిస్సైల్స్, డ్రోన్లతో భారత ఆర్మీ స్ధావరాలే టార్గెట్ గా దాడులు జరిపింది. కానీ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టం వీటిని గాల్లోనే పేల్చి నేలకూల్చాయి. 

ఇలా ప్రస్తుతం పాకిస్థాన్ దాడులకు దిగిన నేపథ్యంలో భారతదేశంలోని అన్నిప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. దీంతో ఎలాంటి అవాాంఛనీయ ఘటనలు జరగకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేాసారు. ఈ క్రమంలో నెల్లూరులో కూడా తనిఖీలు ముమ్మరం చేసారు. నెల్లూరు జిల్లా ఎస్పీ, గుంతకల్ రైల్వే ఎస్పీ ఆదేశాల మేరకు నెల్లూరు రైల్వే స్టేషన్‌లో డాగ్ స్క్వాడ్, జీఆర్పీ బృందం, సంతపేట పోలీసులు కలిసి తనిఖీలు చేపట్టారు.

రైల్వే ప్లాట్‌ఫారాలు, రైలు బోగీలు, పార్శిల్ ఆఫీసులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలపై రైల్వే డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ... "పహల్గాం దాడి తర్వాత ఏపీ డీజీపీ, గుంతకల్ ఎస్ఆర్పీ ఆదేశాల మేరకు నెల్లూరు రైల్వే స్టేషన్‌లో తనిఖీలు ప్రారంభించాం. స్థానిక ఇన్‌స్పెక్టర్, ముగ్గురు టౌన్ ఇన్‌స్పెక్టర్లు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, టౌన్ పోలీసుల నుండి దాదాపు 100 మంది సిబ్బంది, డాగ్ స్క్వాడ్, బీడీ బృందం ఈ రైల్వే స్టేషన్ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రతి ప్లాట్‌ఫారమ్, రైలు, మొత్తం స్టేషన్ ప్రాంతాన్ని తనిఖీ చేశాం. ఈ ప్రాంతాన్ని పూర్తిగా కవర్ చేయడానికి ఆరు బృందాలుగా విడిపోయాం, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల స్టేషన్లలో కూడా తనిఖీలు చేపట్టాం. స్థానిక పోలీసులు స్టేషన్ల చుట్టూ ఉన్న ప్రాంతాలు, హోటళ్ళు, లాడ్జీలు, బస్ స్టాండ్‌లను తనిఖీ చేయడం ద్వారా సహాయం చేశారు" అని తెలిపారు. 



 
ఇది పహల్గాం ఉగ్రదాడి తర్వాత ముందు జాగ్రత్త చర్య అని రైల్వే డీఎస్పీ మురళీధర్ వివరించారు. స్థానిక పోలీసులు కూడా స్టేషన్‌లో, చుట్టుపక్కల తనిఖీలకు సహకరించారు.
ఇటీవల సెంట్రల్ రైల్వే, బహుళ భద్రతా సంస్థలతో సమన్వయంతో, మంగళవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) వద్ద పూర్తి స్థాయి మాక్ డ్రిల్ నిర్వహించింది.

Read more Articles on