ఎన్ కౌంటర్ ఎఫెక్ట్

Published : Oct 29, 2016, 08:10 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
ఎన్ కౌంటర్ ఎఫెక్ట్

సారాంశం

ఎన్ కౌంటర్ ఎఫెక్ట్ బాగా కనబడుతోంది జిల్లాల పర్యటనలు రద్దు సామాన్యులకు అపాయింట్ మెంట్లు రద్దు

ఎన్ కౌంటర్ ఎఫెక్ట్  ఇటు ముఖ్యమంత్రిపైనే కాకుండా అటు సామాన్యులపైన కూడా బాగానే కనబడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు పర్యటనలతో పాటు ఆయన్ను కలిసే వారిపైన కూడా ఆంక్షలు మొదలయ్యాయి. మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి భారీ ఎత్తున అదీ అగ్రనేతలు పోలీసు కాల్పుల్లో హతమయ్యారు.

పోయిన సోమవారం ఉదయం ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో సుమారు 25 మంది మావోయిస్టులు మృతి చెందారు. అప్పటి నుండి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు ప్రధానంగా విశాఖపట్నం జిల్లాలో ఒకలాంటి ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.

ఎన్ కౌంటర్ జరిగిన మల్కనగిరి ప్రాంతం విశాఖజిల్లాలోని ముంచిగ్ పుట్ మండలానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దాంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులెవరూ తమకు చెప్పకుండా తమ నియోజక వర్గాలకు వెళ్ళ వద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అదే విధంగా ముఖ్యమంత్రి విషయంలో పోలీసులు ఇప్పటికే ఉన్న భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు. చంద్రబాబుకున్న బ్లాక్ కమాండోల సంఖ్యను మరింత పెంచారు. దాంతో పాటు కొద్ది రోజుల వరకూ ఉత్తరాంధ్రకు వెళ్ళకుండా ఉంటేనే మంచిదని కూడా పోలీసు ఉన్నతాధికారులు సిఎంకు సలహా ఇచ్చారు.

దాదాపు ఆరు రోజులుగా చంద్రబాబు జిల్లా పర్యటనలు ఏవీ పెట్టుకోకపోవటం గమనార్హం. అదే సమయంలో ముఖ్యమంత్రిని కలుస్తున్న సామాన్యులకు కొద్ది రోజులు అపాయింట్ మెంట్లను రద్దు చేసినట్లు సమాచారం.

  మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్ కె)ఉనికిపై అనేక వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఆర్కె పోలీసుల అదుపులో ఉన్నారని హక్కుల సంఘాల నేతలు, పోలీసు కాల్పుల్లో మృతిచెందినట్లు మావోయిస్టు నేత పేరుతో ఒక ప్రకటన ప్రచారంలో ఉంది.

ఆర్కె తమ ఆధీనంలోనే లేరని డిజిపి సాంబశివరావు స్పష్టంగా ప్రకటించారు. దానికితోడు చంద్రబాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడులు జరుపుతామంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి పేరుతో ఒక ప్రకటన కూడా జారీ అయింది. ఇటువంటి పరిస్ధితుల మధ్య చంద్రబాబుకు ఉన్న భద్రతను పోలీసు ఉన్నతాధికారులు మరింత కట్టుదిట్టం చేసారు.

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?