రాజకీయాల్లో చాన్నాళ్ల తర్వాత వినబడుతున్న బ్రాహ్మణుడి గొంతు

Published : Oct 29, 2016, 07:32 AM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
రాజకీయాల్లో చాన్నాళ్ల తర్వాత  వినబడుతున్న బ్రాహ్మణుడి గొంతు

సారాంశం

రాష్ట్రంలో రాజకీయ పట్టు కోల్పోియిన బ్రాహ్మణులు ప్రకాశం తర్వాత ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్న బ్రాహ్మణ నేత ఉండవల్లి రాజకీయాలే వేరు...

చాన్నాళ్లకి తెలుగు ప్రజల మధ్య ఒక బ్రాహ్మణుడి గొంతు వినబడుతూ ఉంది. ఎరితోనైనా తలపడేందుకు సిద్ధమంటోందీ గొంతు. కోర్టులో వాదానికైనా, బహిరంగ చర్చకైనా, ఎలాంటి విచారణకయినా సిద్దమేనని అంటోంది. గత ఆరు దశబ్దాలలో  ఒక ప్రభుత్వాధినేతకు, బలమయిన రాజకీయ శక్తులకు సవాల్ విసిరిన బ్రాహ్మణుడెవరూ లేరు. ఈ కోవలో ఒక కొసన టంగుటూరి ప్రకాశం పంతులుంటే, మరొక కొసన ఉండేది మాజీ రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమారే.

 

ఇపుడున్న భూస్వామ్య కుల రాజకీయాల మధ్య వ్యవసాయేతర కులాలు చప్పట్టు కొట్టడానికి తప్ప గొంతెత్తి అరవడానికి పనికిరావు. అందులోబ్రాహ్మణులొకరు. పాలక కులం కాక పోయినా బ్రిటిష్ కాలం నుంచి రాజకీయాలను శాసించిన  ఈ కులం 1983 లో ఎన్టీరామారావు ప్రభంజనంతో కుప్పకూలిపోయింది. 1890 ప్రాంతంలో అనంతపురం జిల్లాకు చెందిన కొంతమంది బ్రాహ్మేణేతరులు ప్రభుత్వంలో బ్రాహణుల పెత్తనం పెరిగిపోతున్నదని , ఫలితంగా తాము కఛేరిల్లో కాలు పెట్ట లేకపోతున్నామని ఫిర్యాదు చేసిన పుడు, మదరాసు గవర్నర్ విచారణ జరిపించారు. అప్పటి లెక్కల ప్రకారం రాయలసీమ నాలుగు జిల్లాల కలెక్టరేట్లలో ఉన్న వాళ్లంతా బ్రాహ్మణులే నని తేలింది. అంతేకాదు, వాళ్లంతా ఒకేకుటుంబానికి చెందిన బంధువర్గమే. ఈ పరిస్థితి పోవాలని ఉత్తర్వులొస్తే, నెల్లూరు జిల్లా కలెక్టర్, బ్రాహ్మణులను తొలగిస్తే  ప్రభుత్వం నడవదని చెప్పేశాడు.

 

  1983 కంటే ముందు  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 23 దాకా మంది బ్రాహ్మణ సభ్యులుండేవారు. 2014లో వీరి సంఖ్య ఒకటికి పడిపోయింది.  1953 నుంచి ఇప్పటి దాకా చాలా మంది బ్రాహ్మణులు రాజకీయాలలో ప్రవేశించారు, రాణించారు. ప్రకాశం పంతులు, బూర్గుల రామకృష్ణ రావు ముఖ్యమంత్రులయయ్యారు. పివి నరసింహారావు ప్రధాని అయ్యారు. ఈ మధ్యలో అయ్యదేవర కాళేశ్వరరావు,  వావిలాల గోపాల కృష్ణయ్య, హళ్వి సత్యానారాయణ,  సంపత్ రాఘవాచార్య, ఎ శ్రీరాములు,  టికె ఆర్ శర్మ, భాట్టం శ్రీరామ్మూర్తి, తె్న్నేటి విశ్వనాథం,  పరకాల శేషావతారం, కోన ప్రబాకర్ రావు , శ్రీపాద రావు, వి.రామారావు, కరణం రామచంద్రరావు,హయగ్రీవాచారి, చకిలం శ్రీనివాసరావు, ద్రోణం రాజు సత్యనారాయణ, కోటా శ్రీనివాసరావు తదితరులు వచ్చారు. వీరిలో కొంతమంది తమ కాలంపై  చెరగనిముద్ర వేస్తే మిగతా వాళ్ల ఛటుక్కున మెరుపులా మెరిసి మాయమయ్యారు.

 

గత పదేళ్లో రాజకీయాలలో వినబడుతున్న పేర్లు చాలా తక్కువ- చంద్రశేఖర కల్కూర, పరకాల ప్రభాకర్, ద్రోణం రాజు శ్రీనివాస్, మల్లాది, విష్ణు, కోనా రఘుపతి, ఉండవల్లి అరుణ్ కుమార్. యాక్టివిస్తు కావలసిన  పరకాల ప్రభాకర్ దారి ’ప్రజారాజ్యం’ తర్వాత మారిపోయింది. ఈ పరంపరలో మాజీ  రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పూర్తి గా భిన్నమయిన నాయకుడు.

 

చదువు సంధ్యలు దండిగా ఉన్నా స్వాతంత్య్రానంతరం యాక్టివిస్టు రాజకీయాలలో బ్రాహ్మణలెపుడూ  లేరనే చెప్పాలి.  ఇలాంటి వాళ్లు కమ్యూనిస్టులలో, ట్రేడ్ యూనియన్ లలో  కనిపిస్తారు. 1953 తర్వాత రాజకీయాలలో నుంచి కనుమరుగయిన వర్గం ఇది. 

 

రాజకీయాలలో అవతలి వాడికి సవాళ్ విసిరే ఛేవ నాటి ప్రకాశం పంతులు కే ఉండింది. రాజకీయలలో వెలెత్తి చూపలేని జీవితం గడిపాడు కాబట్టి ఎవరినైనా ఒరేయ్ అనగల సత్తా ఉన్న  ధైర్యశాలి.  1953 తర్వాత బ్రాహ్మణులలొ ఇలాంటి స్వరం ఇప్పటి దాకా ఎవరికీ రాలేదని చెబుతారు. మహాపండితుడయిన మాజీ ప్రధాని పివి నరసింహారావు చాణక్య రాజకీయాలు నెరిపారేమో గాని బహిరంగ సవాళ్లు ఆయన స్వభావాం కాదు. ప్రకాశం పంతులు తర్వాత బిగ్గరగా ప్రత్యర్థులకు సవాళ్లు విసరగలిగిన సత్తా  ఉన్నబ్రాహ్మణ నాయకుడు ఉండవల్లియే. ఇంతరబిగ్గర  స్వరం ఇతర వ్యవసాయేతర కులం నుంచి నుంచి కూడా రావడంలేదు. ప్రస్తుతానికి  ఇంత గట్టిగా  ముఖ్యమంత్రిని నిలదీయ శక్తి బిసి ఎస్సి కులాలకయితే  ఇంకా రాలేదని చెప్పాలి.

 

బ్రాహ్మణ పాండిత్యం, రాజకీయ దురుసుతనం, నిజాయితీ అన్ని కలగలసిన నాయకుడు ఉండవల్లి . ఏ విషయాన్నయినా క్షణ్ణంగా పరిశోధించి గాని మాట్లాడడు. అందుకే మాట మాట్లాడితే సవాల్ విసురుతాడు. సవాల్ మీద నిలబడగలిగి సరుకు సమకూర్చకునే మాట్లాడతాడు. రెండు తెలుగు రాష్ట్రాలో భాషా శుద్ధి ఉన్న  ప్రజా  ప్రతినిధులు బాగా తక్కువ. తడబడకుండా ధారాళంగా,అవతలి వ్యక్తికి అర్థమయ్యేలా తెలుగులో మాట్లాడే వాళ్లు మరీ  తక్కువ. 

 

ఇలాంటి ప్రతిభావంతులలతో అరుణ్ కుమార్ ఒకరు. ఉపన్యాస అనువాదం ద్వారా  సోనియా గాంధీకి దగ్గిరయ్యారని చెబుతారు.  జీవితంలో పారదర్శకత,  సమస్యలను ఎదుర్కేనే స్వభావం, అసరమయితే ఎవరినయినా ఎదిరించడం, నచ్చక పోతే బహిరంగంగా విభేదించడం, నమ్మిన దానికి కట్టుబడే మనస్తత్వం ఆయనలో సమృద్ధిగా ఉన్నాయి. గతంలో ఈనాడు యాజమాన్యం మీద యుద్ధ  ప్రటించిన కడవరకు నిలిచినవాడు. ఇపుడు ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడి రహస్య ముఖం బయపెడతానంటున్నాడు. అమరావతి దగ్గిర నుంచి పోలవరం ప్రాజక్టు దాకా  తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి వాసన వేస్తున్నదని, దీనికి కడిగేయాల్సిందే నని చెబుతున్నారు. ఓటుకు నోటు కేసులో తనకూ  మాట్లడే అవకాశం కల్పించాలని కోర్టును వినతి చేస్తున్నాడు.

 

ఇపుడయితే ఏ పార్టీలో లేడు. విభజనతో గాయపడి రాజకీయ విరామం ప్రటించిన కాంగ్రెస్ వారిలో ఆయన ఒకరు.  ఇపుడాయన అవినీతి వ్యతిరేక పోరాటం అంటూ రాజకీయాల మధ్య కొస్తున్నారు. చివరకేమయినా అరుణ్ కుమార్ పాతకాలపు నేతగా కాకుండా, పోరాట బ్రాహ్మణుడుగా మిగిలిపోవడం గ్యారంటి.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?