కరోనా తీవ్రత: ఏపీ- తెలంగాణ మధ్య ఇప్పటికే బస్సులు బంద్.. తాజాగా రైళ్లు కూడా

By Siva KodatiFirst Published May 6, 2021, 10:24 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ నియంత్రణ చర్యల ప్రభావం ప్రజా రవాణాపై పడింది. ఇప్పటికే ఏపీలో కోవిడ్ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా రైల్వేశాఖ సైతం సంచలన నిర్ణయం తీసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ నియంత్రణ చర్యల ప్రభావం ప్రజా రవాణాపై పడింది. ఇప్పటికే ఏపీలో కోవిడ్ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా రైల్వేశాఖ సైతం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇరు రాష్ట్రాల్లో పాక్షిక కర్ఫ్యూ నేపథ్యంలో ప్రయాణానికి జనం ఆసక్తి చూపించకపోవడంతో రైళ్లు వెలవెలబోతున్నాయి. దీంతో అతి తక్కువ ఆక్యుపెన్సీ దృష్ట్యా ఏపీ, తెలంగాణ మధ్య పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.

ఇరు ప్రాంతాల మధ్య నడిచే 28 ప్రత్యేక రైళ్లను రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 30 రైళ్లు సైతం రైల్వేశాఖ రద్దు చేసింది. వీటిలో శతాబ్ది, జనశతాబ్ది, దురంతో, రాజధాని రైళ్లు సైతం వున్నాయి. 

అంతకుముందు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే ఆర్టీసీ బస్సులను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు టీఎస్ఆర్టీసీ ఎండీ . ఏపీలో ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తాత్కాలికంగా బస్సులను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Also Read:లాక్‌డౌన్ వల్ల నో యూజ్... తెలంగాణలో ఆ ఆలోచన లేదు : కేసీఆర్ సంచలన ప్రకటన

ఉదయం బయల్దేరిన బస్సులు మధ్యాహ్నానికి చేరుకునే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సు సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని టీఎస్ఆర్టీసీ ఎండీ తెలిపారు. 

మరోవైపు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున ఐదు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇదే సమయంలో ప్రజారవాణాను సైతం నిలిపివేసింది ఏపీ సర్కార్.

కర్ఫ్యూ మినహా మిగిలిన కొన్ని గంటల వ్యవధిలో ప్రయాణించేవారు తక్కువగా ఉంటారని.. బస్సులు నడిపినప్పటికీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని టీఎస్​ ఆర్టీసీ భావించింది. ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి సాధారణ పరిస్థితి నెలకొనే వరకు సర్వీసులను ఆపడమే మంచిదని అధికారులు నిర్ణయించారు. కర్ఫ్యూ కారణంగా ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సులు, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులను ఎంజీబీఎస్‌లో నిలిపివేశారు.

click me!