ఏపీకి తీరనున్న వ్యాక్సిన్ కష్టాలు: గన్నవరానికి చేరుకున్న 1.92 కోవిషీల్డ్ టీకాలు

By Siva KodatiFirst Published May 6, 2021, 8:03 PM IST
Highlights

వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు  ఊరట లభించింది. ఏపీకి మరో 1.92 లక్షల కొవిడ్‌ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి గురువారం గన్నవరం విమానాశ్రయానికి టీకాలు చేరుకున్నాయి

వ్యాక్సిన్ కొరతతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు  ఊరట లభించింది. ఏపీకి మరో 1.92 లక్షల కొవిడ్‌ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి గురువారం గన్నవరం విమానాశ్రయానికి టీకాలు చేరుకున్నాయి.

వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి  తరలించారు. అక్కడ నుంచి రాష్ట్రంలోని జిల్లాలకు టీకాలను అధికారులు తరలించనున్నారు. టీకా కొరత నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ వేస్తున్నారు.  

Also Read:ఏమాత్రం తగ్గని తీవ్రత: ఏపీలో కొత్తగా 21,954 కేసులు.. తూర్పుగోదావరిలో ఆందోళనకరం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే వుంది. పగటి పూట కర్ఫ్యూతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా దేశంలో కోవిడ్ తీవ్రత అధికంగా వున్న రాష్ట్రాల లిస్ట్‌లోకి ఏపీ వెళ్లిపోయింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 21,954 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 12,28,186కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 72 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 8,446కి చేరుకుంది.

click me!