ఏమాత్రం తగ్గని తీవ్రత: ఏపీలో కొత్తగా 21,954 కేసులు.. తూర్పుగోదావరిలో ఆందోళనకరం

By Siva KodatiFirst Published May 6, 2021, 7:43 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే వుంది. పగటి పూట కర్ఫ్యూతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా దేశంలో కోవిడ్ తీవ్రత అధికంగా వున్న రాష్ట్రాల లిస్ట్‌లోకి ఏపీ వెళ్లిపోయింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 21,954 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే వుంది. పగటి పూట కర్ఫ్యూతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా దేశంలో కోవిడ్ తీవ్రత అధికంగా వున్న రాష్ట్రాల లిస్ట్‌లోకి ఏపీ వెళ్లిపోయింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 21,954 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 12,28,186కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 72 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 8,446కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విశాఖపట్నం 11, విజయనగరం 9, అనంతపురం 8, తూర్పుగోదావరి 9, ప్రకాశం 6, పశ్చిమ గోదావరి 5, చిత్తూరు 5, గుంటూరు 5, కర్నూలు 4, నెల్లూరు 2, కృష్ణ 4, శ్రీకాకుళం నలుగురు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 10,141 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 1037,411కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,10,147 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,70,60,446కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,82,329 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1871, చిత్తూరు 2354, తూర్పుగోదావరి 3531, గుంటూరు 1348, కడప 1130, కృష్ణ 548, కర్నూలు 1920, నెల్లూరు 1292, ప్రకాశం 1666, శ్రీకాకుళం 1939, విశాఖపట్నం 2107, విజయనగరం 1160, పశ్చిమ గోదావరిలలో 1088 మంది చొప్పున వైరస్ సోకింది. 

 

 

: 06/05/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 12,25,291 పాజిటివ్ కేసు లకు గాను
*10,34,516 మంది డిశ్చార్జ్ కాగా
*8,446 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,82,329 pic.twitter.com/4qRtEReMGV

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!