విభజనపై ‘సుప్రిం’ విచారణ

Published : Jan 16, 2017, 11:44 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
విభజనపై ‘సుప్రిం’ విచారణ

సారాంశం

అప్పుడేమో తాము జోక్య  చేసుకోలేమని చెప్పిన న్యాయస్ధానం ఇపుడు కేంద్రానికి నీటీసులు ఇవ్వడం ఏమిటి క్యామిడీ కాకపోతే.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్ధీకరణ చట్టంపై ఎట్టకేలకు సుప్రింకోర్టు విచారణ మొదలుపెట్టంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామరాజు, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటీషన్ను సుప్రింకోర్టు విచారణకు స్వీకరించింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్రప్రభుత్వానికి సుప్రిం నోటీసులు జారీ చేసింది.

 

రాష్ట్ర విభజనలో హేతుబద్దతు లేదంటూ పిటీషనర్లు వాదిస్తున్నారు. పునర్ వ్యవస్ధీకరణ చట్టంలో అనేక లొసుగులున్నట్లు ఆరోపిస్తున్నారు. విభజన అంశ ఆమోదం పొందిన తర్వాత కూడా తెలంగాణాలోని 7 మండలాలను ఏపిలో కలపటాన్ని పిటీషనర్లు ఉదాహరణగా చూపుతున్నారు. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందని వాదిస్తున్నారు.

 

ఇదంతా సరే, రాష్ట్ర విభజన జరిగిన రెండున్నరేళ్ల తర్వాత ఇపుడు తీరిగ్గా సుప్రింకోర్టులో కేసు విచారించరణకు స్వీకరించి ఏమిటి ఉపయోగం? రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదన్నది వాస్తవమే. అడ్డుగోలు విభజన వల్ల ఏపి పూర్తిగా అన్యాయానికి గురైన విషయాన్నీ ఎవరూ కాదనలేరు. వివిధ శాఖలకు చెందిన ఆస్తులు, అప్పులను జనాభా ప్రాతిపదికగా విభజించిన కేంద్రం విద్యుత్ విషయంలో మాత్రం వినియోగం ఆధారంగా విభజించింది.

 

ఆస్తులన్నింటినీ తెలంగాణాకు అప్పగించి, ఏపిని ఎండబెట్టింది. అంతెందుకు, ఆస్తులు, అప్పులు  విభజన మామూలు జనానికి అర్ధమయ్యేవి కావు. అందరికీ అర్ధమయ్యేలా చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. రాష్ట్ర విభజన తర్వాత ఏపిలో 175 మంది ఎంఎల్ఏలు, తెలంగాణాలో 119 మంది ఎంఎల్ఏలున్నారు. సమైక్య రాష్ట్రంలో 294 మంది శాసనసభ్యులుండే అసెంబ్లీ భవనం  తెలంగాణాపరమైంది. 175 మంది ఎంఎల్ఏలుండే ఏపికి ఇవ్వకుండా 119 మంది ఎంఎల్ఏలుండే తెలంగాణాకు ఎలా ఇస్తారు?

 

ఎలా ఇస్తారంటే అలానే ఇచ్చేసారు. ప్రతీ విషయంలోనూ ఏపికి అన్యాయమే జరిగింది. అప్పటి వరకూ రాజధాని అయిన హైదరాబాద్ ను ఏకపక్షంగా తెలంగాణాకు రాజధానిగా కేటాయించేసారు. కేటాయిస్తే కేటాయించారు. రాజధాని నుండి వచ్చే ఆదాయాన్ని ఏపికి కూడా పంచాలి కదా? విభజన కమిటి కుదరదన్నది. అదేమంటే సమాధానం లేదు. ఈ విధంగా ప్రతీ విషయంలోనూ ఏపికి అన్యాయమే జరిగింది. విభజన చట్టాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణా ప్రభుత్వం కూడా ఏపితో ఓ రేంజిలో ఆటాడుకుంటోంది. గవర్నర్, హైకోర్టు చివరకు కేంద్రం కూడా ఏమీ చేయలేకపోతోంది కదా?

 

సరే, అదంతా చరిత్ర. ఎందుకంటే, విభజన జరిగిపోయింది, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇంకో రెండున్నర సంవత్సరాలుంటే మళ్లీ ఎన్నికలు కూడా వస్తాయి. విభజనకు ముందే పలువురు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. విభజన విధానం బాగాలేదన్నారు. అప్పుడేమో తాము జోక్య  చేసుకోలేమని చెప్పిన న్యాయస్ధానం ఇపుడు కేంద్రానికి నీటీసులు ఇవ్వడం ఏమిటి క్యామిడీ కాకపోతే. రాష్ట్ర విభజన సరిగా జరగలేదనే సుప్రింకోర్టు కూడా అభిప్రాయపడిందే అనుకుందాం! ఇపుడు ఏపికి వచ్చే లాభమేమిటి? మానిపోతున్న గాయాన్ని కెలకటం తప్పితే.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?