చంద్రబాబు వెంటబడిన స్విస్ రైల్ కంపెనీ

Published : Jan 16, 2017, 10:07 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
చంద్రబాబు వెంటబడిన స్విస్ రైల్ కంపెనీ

సారాంశం

ఒకె అంటే  ఆంధ్రప్రదేశ్  అవసరాలకు తగిన స్పీడ్ రైళ్లను అందిస్తామంటున్న స్టాడ్లర్  రైల్ కంపెనీ

స్విజర్లాండ్ జ్యూరిక్ లో దిగాడో లేదో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు బిజినెస్ చర్చలు మొదలుపెట్టారు.

 

బోణీ బ్రహ్మండంగా దొరికింది. అంతర్జాతీయ రైల్ బోగీల తయారుదారు స్టాడ్లర్ రైల్ కంపెనీ ఆయన వెంటబడింది. కొద్ది సేపటి కిందట  దావోస్ లో  జరిగిన మొదటి ద్వైపాక్షిక సమావేశం ఇది. సక్సెస్ అని ముమఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.

 

స్విస్ విలువలతో నడిచే కంపెనీ మాదని ఈ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి తెలియచేశారు.  ఈ సంస్థ 1942లో ఏర్పాటయింది. ఐరోపాలో 11 చోట్ల ఈ కంపెనీకి కర్మాగారాలున్నాయి.

 

రైల్ బోగీలు తయారీలో 75 సంవత్సరాల అనుభవం ఉన్న సంస్థ ఇది. స్టాడ్లర్ 2.2 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన సంస్థ.పోలండ్, జర్మనీ, హంగేరీ, స్విట్జర్లాండ్, బేలారస, స్పెయిన్ లలో ఉత్పత్తి కేంద్రాలున్నాయి.

 

ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో స్టాడ్లర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ జెనెల్టెన్, స్టీఫెన్ రుటిషాసర్, థామస్ జ్యుఫెల్ తదితరరలు పాల్గొన్నారు.

 

తమ రైల్ బోగీలు తయారీ కర్మాగారాన్ని ఈరోజు సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రిని  పీటర్ కారు.దానికి  సీఎం చంద్రబాబు అంగీకారం. తెలిపారు. తర్వాత తీరిక ఉన్నపుడు ముఖ్యమంత్రి ఈ కంపెనీని సందర్శిస్తారు.

 

భారత్ తో పాటు ఆంధ్రప్రదేశ్  అవసరాలకు తగిన స్పీడ్ రైళ్లను మేము అందివ్వగలమని  పీటర్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

 

తాము అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారత్ లలో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయమని, కోచ్ లు, ఇంజిన్లు, స్పీడ్ రైళ్ల తయారీలో మాకు బాగాపేరుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

 

‘భారత్ మాకు ఒక మంచి మార్కెట్ గానే కాకుండా తయారీ కేంద్రంగా తయారుకావాలన్నది తమ కోరిక,’ అని పీటర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

సౌత్ ఈస్ట్ ఏషియా కు భారత్ ఒక హబ్ గా మార్చాలని మా వ్యూహం అని కూడా పీటర్ అన్నారు. (ఇంకే ముంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి జీవితాశయం కూడా అదే.)

 

స్థానిక అవసరాలకు తగిన తయారీ, ఆకృతుల రూపకల్పన, ఉత్పత్తి, సప్లయ్ చైన్ గా ఉండాలనాదే మా ప్రణాళిక అని కూడా  పీటర్ వివరించారు.

 

అవకాశం కల్పిస్తే అన్ని విడి భాగాలు తయారు చేసే ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, అల్లుమినియంతో కోచ్ బాడీస్ తయారు చేయడం స్టాడ్లర్ ప్రత్యేకత అని కూడా పీటర్ చెప్పారు.

 

వెస్ట్ బెంగాల్ లోని కాంచరపరా లో ఇప్పటికే స్టాడ్లర్ కార్యకలాపాలు మొదలయ్యాయని,

విశాఖపట్నంలో మరో యూనిట్ ఏర్పాటుకు ప్రయత్నాలచేస్తామని ,విశాఖ యూనిట్లో అల్లుమినియంతో విడిభాగాల తయారీకి ప్రణాళికల సిద్ధం చేసుకుంటున్నామని ఆయన చెప్పారు.

 

భూమి, ఇతర మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం గల మనవ వనరులపై ప్రధానంగా దృష్టి తమ పెట్టుబడులతో 3 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందన్న స్టాడ్లర్ ప్రతినిధులు  తెలిపారు.

 

సముద్రానికి దగ్గరగా భూ లభ్యత, రవాణా సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవవనరులు, సరళీకృత పన్నుల విధానం కలిగి ఉండే చోట యూనిట్ నెలకొల్పాలని ఆలోచిస్తున్నామని పీటర్ అన్నారు.

 

ముఖ్యమంత్రి స్పందిస్తూ , ఏపీలో రెండు మెట్రో లైన్లు అభివృద్ధి చేస్తూ, స్పీడ్ ట్రైన్ ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని  చెప్పారు.

 

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు  ప్రతియేటా దావాస్ కు ముఖ్యమంత్రి వస్తుంటారు.చర్చలు సాగిస్తుంటారు. ఈ సారి కూడా ఆయన పెట్టుబడి చర్చలు సాగిస్తున్నారు.

 

 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?