తిరుమల ఆలయాన్ని రక్షించండి - ప్రధాని మోడీకి టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు విజ్ఞప్తి

Published : Nov 27, 2023 3:58 PM IST
తిరుమల ఆలయాన్ని రక్షించండి - ప్రధాని మోడీకి టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు విజ్ఞప్తి

సారాంశం

Ramana dikshitulu : ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల పర్యటన నేపథ్యంలో టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రధాన్యత సంతరించుకుంది. తిరుమల ఆలయాన్ని రక్షించాలని అందులో ప్రధాని మోడీని ఆయన అభ్యర్థించారు.

Ramana dikshitulu :  తిరుమల శ్రీవారి ఆలయాన్ని రక్షించాలని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ప్రధాని నరేంద్ర మోడీని ‘ఎక్స్’ (ట్విట్టర్)లో కోరారు. సోమవారం ఉదయం తిరుమల దేవస్థానాన్ని ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా రమణ దీక్షితులు ట్వీట్ చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

వాహనాల్లో నుంచి రోడ్లపైకి కరెన్సీ నోట్లు వెదజల్లిన యువకులు.. వీడియో వైరల్..

టీటీడీ పరిధిలోని హిందూ దేవాలయ పురాతన సంప్రదాయ కట్టడాలను, ఆస్తులను క్రమపద్ధతిలో ధ్వంసం చేస్తున్న సనాతనేతర అధికారి, ప్రభుత్వ గుప్పిట్లో ఆలయం ఉందని అన్నారు. దయచేసి ఆలయాన్ని రక్షించాలని కోరారు. ఇక్కడ హిందూ రాజ్యాన్ని స్థాపించాలని కోరారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తారని చెప్పారు 

ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆయన మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. అర్చకులు ప్రధానికి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని, కానుకలు సమర్పించారు. వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం వకులామాత, విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హుండీలో  కానుకలు వేసి నమస్కరించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

PREV
click me!