అమ్మాయిలు మరీ ఇలా తయారయ్యారేంటి..! కేవలం అందుకోసమే జుట్లు పట్టుకుని ఇంతలా కొట్టుకున్నాారా..! (వీడియో)

Published : Nov 27, 2023, 02:02 PM IST
అమ్మాయిలు మరీ ఇలా తయారయ్యారేంటి..! కేవలం అందుకోసమే జుట్లు పట్టుకుని ఇంతలా కొట్టుకున్నాారా..! (వీడియో)

సారాంశం

కేవలం సెల్పీలు, రీల్స్ వీడియోల కోసం కొందరు అమ్మాయిలు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. అందరూ చూస్తుండగానే జుట్లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. ఈ ఘటన గంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు : సెల్ ఫోన్ల రాకతో ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం దూరంగా వున్నవారితో మాట్లాడేందుకు మాత్రమే ఫోన్ ఉపయోగించేవారు... ఇప్పుడు ఏం చేయాలన్నా మొబైల్ కావాల్సిందే. మనిషి నిత్యావసర వస్తువు కూడు, గూడు, గుడ్డ అన్నది ఒకప్పటి మాట... ఇప్పుడు మొబైల్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. అయితే ఈ సెల్ ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో...    అంత ప్రమాదమూ వుంది. ముఖ్యంగా సోషల్ మీడియాకు అలవాటుపడ్డ యువత మొబైల్ ను ప్రాణంకంటే ఎక్కువగా చూసుకుంటారు. దేన్నయినా కళ్లతో చూసేకంటే సెల్ ఫోన్ కళ్ళతో చూసి ఆనందపడేవాళ్లు ఎక్కువయిపోయారు. సెల్పీలు, ఫోటోల కోసం ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా గుంటూరులో కొందరు అమ్మాయిలు సెల్పీలు, వీడియోల మోజులో అత్యంత దారుణంగా వ్యవహరించిన ఘటన వెలుగుచూసింది.  

వివరాల్లోకి వెళితే... గుంటూరు పట్టణంలో ఇటీవలే ఓ పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో నిన్న(ఆదివారం) సెలవురోజు కావడంతో ఈ పార్కును చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. పచ్చని చెట్లు... అద్భుతమైన లొకేషన్స్ తో ఆ పార్క్ అందరినీ కనువిందు చేసింది. ఇలా పార్కులోని ఓ ప్రాంతం మరీ అద్భుతంగా వుండటంతో అక్కడ ఫోటోలు,సెల్పీలు దిగడానికి, వీడియోలు తీసుకోడానికి ప్రజలు ఎగబడ్డారు. ఇలా కొందరు అమ్మాయిలు కూడా ఫోటోలు, రీల్స్ తీసుకునేందుకు ప్రయత్నించారు.

అయితే ఫోటోలు, వీడియోలు తీసుకునే సమయంలో అమ్మాయిల మధ్య మాటామాటా పెరిగి గొడవ ప్రారంభమయ్యింది. ఈ ఘర్షణ మరింత ముదిరి అందరూ చూస్తుండగానే అమ్మాయిలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ గొడవతో పార్కులో ఒక్కసారిగా అలజడి రేగింది. చివరకు అక్కడే వున్నవారు అమ్మాయిలను విడిపించి అక్కడినుండి పంపించారు.

వీడియో 

ఈ అమ్మాయిల గొడవను అక్కడేవున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇదికాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అమ్మాయిలు ఇలా తయారయ్యారేంటి..! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Rajamahendravaram Milk adulterated: కల్తీ పాలు వినియోగించిన వారి ఆరోగ్య పరిస్థితి| Asianet Telugu
Rajamahendravaram Milk adulterated: కల్తీ పాల బాధితులను పరామర్శించిన అధికారులు| Asianet News Telugu