Nara Chandrababu naidu...లిక్కర్ కేసు: బాబు ముందస్తు బెయిల్ పై తీర్పు రిజర్వ్

By narsimha lode  |  First Published Nov 27, 2023, 2:41 PM IST


మద్యం కంపెనీలకు అనుమతుల విషయంలో  చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై  ఇరు వర్గాల వాదలను  ముగిశాయి. ఇవాళ ఏపీ హైకోర్టులో ఇరు వర్గాల వాదనలను  ఏపీ హైకోర్టు  విన్నది. 


అమరావతి: మద్యం కంపెనీలకు  అనుమతుల్లో అవకతవకలకు పాల్పడ్డారని  చంద్రబాబుపై నమోదైన కేసులో తీర్పును రిజర్వ్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.

మద్యం తయారీ కంపెనీలకు అనుమతుల విషయంలో  అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబుపై  ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (ఏపీ సీఐడీ) కేసు నమోదు చేసింది.ఈ కేసు విషయమై  ఆంధ్రప్రదేశ్  హైకోర్టులో చంద్రబాబు నాయుడు  ముందస్తు  బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై చంద్రబాబు తరపు న్యాయవాదులు, ఏపీ సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలను  ఏపీ హైకోర్టు విన్నది.  తీర్పును రిజర్వ్ చేసింది.

Latest Videos

undefined

మద్యం తయారీ కంపెనీలకు  చంద్రబాబు సర్కార్ వ్యవహరించిందని ఏపీబ్రేవరేజేస్ ఎండీ ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ చంద్రబాబునాయుడితో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేసింది.ఈ కేసుపై  చంద్రబాబు, కొల్లు రవీంద్రలు వేర్వేరుగా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. ఈ నెల  21న  ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.గత వాయిదాలో విచారణకు సమయం పూర్తి కావడంతో ఇవాళ్టికి విచారణను వాయిదా వేసింది.  ఇవాళ  ఇరు వర్గాల వాదనలను ఏపీ హైకోర్టు విన్నది.  ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టుగా ఏపీ హైకోర్టు తెలిపింది.

also read:Chandrababu Naidu ఐఆర్ఆర్, ఇసుక పాలసీ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు: చర్యలొద్దని హైకోర్టు ఆదేశం

ఈ ఏడాది అక్టోబర్  31న చంద్రబాబుపై  ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కొన్ని మద్యం కంపెనీలకు ప్రయోజనం కల్గించేలా వ్యవహరించేలా తీసుకున్న నిర్ణయం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం  రూ. 1300 కోట్లు నష్టం వాటిల్లిందని  బ్రేవరేజేస్ కార్పోరేషన్ ఆరోపిస్తుంది.  ఏపీ బ్రేవరేజేస్ ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. 1988 ఐపీసీ ప్రివెన్షన్ ఆఫ్ కరఫ్షన్ యాక్ట్  166, 1678, 409, 120(బి) రెడ్ విత్  34 13,(1), రెడ్ విత్ 13(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


 

click me!