కృష్ణా జిల్లా చెవిటికల్లులో కృష్ణానదిలో చిక్కుకున్న 132 లారీలను బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పులి చింతల గేట్లను కూడా మూసివేశారని.. నాలుగైదు గంటల్లో వదర తగ్గుముఖం పట్టవచ్చని అన్నారు. నీటి మట్టం తగ్గిన వెంటనే లారీలను బయటకు తీసే ప్రయత్నం చేస్తామన్నారు.
కృష్ణా జిల్లా చెవిటికల్లులో సహాయక చర్యలు కొనసాగుతూ వున్నాయి. కృష్ణానదిలో చిక్కుకున్న 132 లారీలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ర్యాంప్ తెగిపోవడంతో లారీలను ఒడ్డుకు చేర్చడం కష్టమని డ్రైవర్లు చెబుతున్నారు. నది మధ్యలోనే లారీలు వుండిపోయాయి. వరద ముప్పు వుందని అధికారులు చెప్పలేదు అంటున్నారు ర్యాంపు నిర్వాహకులు. తాము ఇరిగేషన్ అధికారులను సంప్రదించామని చెప్పారు. ఇప్పటికే పులి చింతల గేట్లను కూడా మూసివేశారని.. నాలుగైదు గంటల్లో వదర తగ్గుముఖం పట్టవచ్చని అన్నారు. నీటి మట్టం తగ్గిన వెంటనే లారీలను బయటకు తీసే ప్రయత్నం చేస్తామన్నారు.
ALso Read:కృష్ణానదిలో.. వరదలో చిక్కుకున్న 70 ఇసుక లారీలు..