ఏపీలో పడిపోయిన కరోనా కేసులు, కొత్తగా 1535 మందికి పాజిటివ్, తూ.గోదావరిలో తీవ్రత

Siva Kodati |  
Published : Aug 14, 2021, 04:47 PM IST
ఏపీలో పడిపోయిన కరోనా కేసులు, కొత్తగా 1535 మందికి పాజిటివ్, తూ.గోదావరిలో తీవ్రత

సారాంశం

ఏపీలో కొత్తగా 1535 కరోనా కేసులు నమోదవ్వగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 2075 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 18,210 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1535 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,92,191కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 16    మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,631కి చేరుకుంది.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 2075 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,60,350కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 69,088 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,55,95,949కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 18,210 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 31, చిత్తూరు 237, తూర్పుగోదావరి 299, గుంటూరు 173, కడప 39, కృష్ణ 109, కర్నూలు 8, నెల్లూరు 211, ప్రకాశం 107, శ్రీకాకుళం 54, విశాఖపట్నం 65, విజయనగరం 25, పశ్చిమ గోదావరిలలో 177 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి