ఆయుర్వేదం, పూజల పేరిట బురిడీ: రాజకీయ నేతలూ స్వామి శిష్యులే.. బాబా లీలలు ఎన్నో...,.

Siva Kodati |  
Published : Aug 14, 2021, 03:59 PM ISTUpdated : Aug 14, 2021, 04:03 PM IST
ఆయుర్వేదం, పూజల పేరిట బురిడీ: రాజకీయ నేతలూ స్వామి శిష్యులే.. బాబా లీలలు ఎన్నో...,.

సారాంశం

రాజకీయ నేతలతో పాటు పలువురు అధికారులకు నెల్లూరు బాబా చికిత్స చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. మాజీ ఆర్మీ అధికారి మల్లేశ్‌తో కలిసి పూజల పేరుతో ప్రజలను బురిడీ కొట్టించాడని అంటున్నారు పోలీసులు

రియల్టర్ విజయ్ భాస్కర్ హత్య కేసులో బాబా త్రిలోక్‌నాథ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. బాబా ముసుగులో త్రిలోక్‌నాథ్ ఆయుర్వేద చికిత్స కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజకీయ నేతలతో పాటు పలువురు అధికారులకు బాబా చికిత్స చేశాడని విచారణలో వెల్లడైంది. మాజీ ఆర్మీ అధికారి మల్లేశ్‌తో కలిసి పూజల పేరుతో ప్రజలను బురిడీ కొట్టించాడని అంటున్నారు పోలీసులు.

Also Read:రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డి హత్య: త్రిలోక్‌నాథ్ బాబా అరెస్ట్

మల్లేశ్, సుధాకర్, బాబా త్రిలోక్ నాథ్ రెడ్డి కలిసి అక్రమాలకు పాల్పడ్డారని అంటున్నారు. సుధాకర్ భార్యతో రియల్టర్ విజయ్ భాస్కర్ అనుచితంగా ప్రవర్తించినందుకే అతనిపై పగ పెంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే మల్లేశ్ సుధాకర్ కలిసి విజయ్ భాస్కర్‌ను చంపారని.. అనంతరం శవాన్ని బాబా వద్దకు తీసుకెళ్లారని పోలీసులు చెబుతున్నారు. డెడ్ బాడీని కాల్చేయాలని బాబా చెప్పడంతోనే కాల్చేశారని అంటున్నారు. నలుగురు నిందితులను విచారిస్తున్నారు పోలీసులు. 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu