బాబుకు సంచయిత కౌంటర్: మా కుటుంబ వ్యవహరాలకు దూరంగా ఉండండి

Published : Jul 14, 2020, 05:28 PM IST
బాబుకు సంచయిత కౌంటర్: మా కుటుంబ వ్యవహరాలకు దూరంగా ఉండండి

సారాంశం

 టీడీపీ చీఫ్ చంద్రబాబుకు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు కౌంటరిచ్చారు. తన చిన్నాన్న ఆశోక్ గజపతి రాజు మాదిరిగానే చంద్రబాబు కూడ లింగ వివక్ష చూపరని భావిస్తున్నట్టుగా ఆమె పేర్కొన్నారు.


అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబుకు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు కౌంటరిచ్చారు. తన చిన్నాన్న ఆశోక్ గజపతి రాజు మాదిరిగానే చంద్రబాబు కూడ లింగ వివక్ష చూపరని భావిస్తున్నట్టుగా ఆమె పేర్కొన్నారు.

గజపతి వంశానికి చట్టబద్ద వారసుడైన ఆనంద గజపతికి తాను వారసురాలిని అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. తమ కుటుంబ వ్యవహారాల్లో తల దూర్చి పత్రి విషయాన్ని రాజకీయం చేయడం తగదని ఆమె చంద్రబాబుకు సూచించారు. 

 

 

 

గజపతి వంశానికి తానే వారసుడినని ఆశోక్ గజపతి మిమ్మల్ని తప్పు దోవ పట్టించారనుకొంటున్నా.. గజపతి కుటుంబ వ్యవహరాలకు దూరంగా ఉంటే బాగుంటుంది, రాజకీయాలు చేయాలని చూడొద్దని ఆమె ట్వీట్ చేశారు. సింహాచలం, మన్సాస్ బోర్డు చైర్ పర్సన్ గా తన నియామకం జరిగినందు గజపతి కుటుంబ హక్కులకు ఎలాంటి భంగం కలుగలేదన్నారు.

 2016 ఏప్రిల్‌లో మన్సాస్‌ వ్యవహారం ఆనాటి టీడీపీ ప్రభుత్వం చేతిలోకి వెళ్లింది. ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ చెరుకూరి కుటుంబరావు, ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ కులపతి ఐవీ రావులను ట్రస్టు సభ్యులుగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం 2016 ఏప్రిల్‌ 7న జీవో 139 జారీ చేసింది. 

ఆ తర్వాత 2017 ఏప్రిల్‌ 27న వారిద్దరిన్నీ కొనసాగిస్తూనే... జీవో నంబర్‌ 155 ద్వారా అశోక్‌గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా బోర్డు సభ్యురాలిగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు.

 

ఈ క్రమంలో సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ మాల భూ సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు వేసిన జగన్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ట్రస్టు చైర్‌పర్సన్‌గా సంచయితను నియమించింది. అదే విధంగాఅశోక్‌ గజతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా సభ్యురాలిని చేసి ఆమెతో పాటు మొత్తంగా ఇదే కుటుంబానికి చెందిన ముగ్గురికి మాన్సాస్‌ ట్రస్టుబోర్డులో స్థానం కల్పించింది. 

సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ గా , మాన్సాస్ ట్రస్ ఛైర్మెన్ గా మహిళలకు హక్కు లేదనట్టుగా  ఆశోక్ గజపతి రాజు మాట్లాడడంపై సంచయిత గజపతి రాజు కౌంటరిచ్చారు.
 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!