మాన్సాస్ వివాదంలో కొత్త ట్విస్ట్: అశోక్ గజపతిపై మహిళా కమీషన్‌ను ఆశ్రయించిన సంచయిత

By Siva KodatiFirst Published Jun 30, 2021, 3:26 PM IST
Highlights

మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో మరో కొత్త మలుపు తిరిగింది. సంచయత గజపతిరాజు రాష్ట్ర మహిళా కమీషన్‌ను ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో మరో కొత్త మలుపు తిరిగింది. సంచయత గజపతిరాజు రాష్ట్ర మహిళా కమీషన్‌ను ఆశ్రయించారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీనిపై ఏపీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. సంచయితపై అశోక్ వ్యాఖ్యలు అహంకారపూరితమని వ్యాఖ్యానించారు. విచారణ జరిపి చర్యలకు ఆదేశిస్తామని వాసిరెడ్డి పద్మ అన్నారు. 

కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన మాన్సాస్ ట్రస్ట్ నియామకం జీవోను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 14న తీర్పు వెలువరించింది. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వానికే కాకుండా మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా నియమతులైన సంచయిత గజపతి రాజుకు షాక్ తగిలింది. మాజీ మంత్రి, టీడీపీ నేత పి. అశోక గజపతిరాజుకు ఊరట లభించింది. 

Also Read:చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలి: మాన్సాస్ ట్రస్ట్‌ వివాదంపై హైకోర్టు తీర్పుపై ఆశోక్‌గజపతిరాజు

మాన్సాస్ ట్రస్ట్ మీద సంచయిత గజపతిరాజు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. సంచయితను మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా నియమిస్తూ జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 72ను జారీ చేసింది. దాన్ని హైకోర్టు రద్దు చేసింది. అలాగే సింహాచలం వరాహలక్ష్మి దేవస్థానం చైర్మన్ గా, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా పి. అశోక గజపతి రాజు నియామకాన్ని పునరుద్ధరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సింహాచలం ట్రస్టుకు కూడా అశోక గజపతి రాజు చైర్మన్ గా కొనసాగుతారు. 
 

click me!