
మంత్రి మండలి సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని ఆలోచిస్తున్నామని.. టీఆర్ఎస్ నేతలు దూకుడుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జగన్ హితవు పలికారు. శ్రీశైలం విద్యుదుత్పత్తతి ఆపేయాలని కేఆర్ఎంబీకి మరో లేఖ రాస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంత్రి చుక్కనీరు కూడా వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది ఏపీ కేబినెట్
కాగా, శ్రీశైలం జలాశయం నుంచి జలవిద్యుత్తు ఉత్పత్తిని తెలంగాణ సర్కార్ నిలిపివేసేలా చూడాలని ఆంద్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్ సీ) సి. నారాయణ రెడ్డి బుధవారం బోర్డు కార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణ ఇక నుంచి నీళ్లు తీసుకోకుండా చూడాలని.. తెలంగాణ యంత్రాంగాన్ని ఈ విషయంలో నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మరోసారి విన్నవిస్తున్నామన్నారు. ఎన్నిసార్లు వద్దని చెబుతున్నా జలవిద్యుత్తు ఉత్పత్తి ఆపకపోగా ఇంకా పెంచుతూనే ఉన్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Also Read:ఒప్పంద సూత్రాలను తెలంగాణ ఉల్లంఘిస్తోంది.. కఠినచర్యలు తీసుకోండి..
ఒక్క సోమవారమే (28-6-21) 16,877 క్యూసెక్కుల నీటిని జలవిద్యుత్తు కోసం తీసుకున్నారని.. మరోవైపు వందశాతం జలవిద్యుత్తు ఉత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం జెన్ కోను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని నారాయణరెడ్డి గుర్తుచేశారు. అంటే శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రం నుంచి రోజుకు 4 టీఎంసీలు విద్యుత్తు ఉత్పాదన కోసం వాడేస్తారని అర్థమన్నారు. ఇది ఏపీ ప్రయోజనాలను పూర్తిగా దెబ్బతీస్తుందని నారాయణ రెడ్డి పేర్కొన్నారు.