సీఎం జగన్ 30 నెలల పాలన పూర్తి.. సవాళ్లను తట్టుకుంటూ మేనిఫెస్టోలోని హామీలను పూర్తి చేశారు: సజ్జల

By Sumanth Kanukula  |  First Published Jan 1, 2022, 3:19 PM IST

కొత్త ఏడాది రాష్ట్ర ప్రజలకు శుభం చేకూరాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) ఆకాంక్షించారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సేవకే పునరంకితం అయిందని తెలిపారు. 


కొత్త ఏడాది రాష్ట్ర ప్రజలకు శుభం చేకూరాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) ఆకాంక్షించారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం 30 నెలల పాలన పూర్తి చేసుకుందని అన్నారు. వైసీపీ ప్రజా సేవకే పునరంకితం అయిందని తెలిపారు. ఏపీ పునర్విభజన తర్వాత 5 ఏళ్లు టీడీపీ పాలన చూసిన ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. అభివృద్దిపై ఆశగా ఉన్న ప్రజలు.. వైఎస్ జగన్ మీద నమ్మకంతో వైఎస్సార్‌సీపీని ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు. 2020లో మొదలైన కరోనాతో ప్రపంచం మొత్తం కుదేలయింది. 

టీడీపీ పాలనలో చేసిన రుణభారంతో రాష్ట్రం కుదలైందని, ఆ తర్వాత కరోనా పరిస్థితులు వచ్చాయని.. అయినప్పటికీ వాటన్నింటిని ఎదుర్కొని సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది నెలలు మాత్రం ఒకింత వెసులుబాటుతో పాలించిన జగన్.. ఆ తర్వాత ఎదురైన సవాళ్లను తట్టుకుంటూ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు. తొలి ఏడాదిలో 95 శాతం హామీలను పూర్తి చేశారని చెప్పారు. వందకు వంద శాతం పూర్తి చేసే దిశగా సాగుతున్నామని తెలిపారు. పథకాల అమలు కోసం గ్రామ, వార్డు వాలంటీర్ల కొత్త వ్యవస్థను తీసుకొచ్చాం. 

Latest Videos

30 నెలల కాలంలో 1.16 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా పేదల ఖాతాల్లోకి చెల్లింపు చేశామని.. దేశ చరిత్రలోనే ఇలా చేయడం తొలిసారి అని అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా.. అర్హత ఉన్నవారికి లబ్ది చేకూరుస్తున్నట్టుగా తెలిపారు. ఎవరైనా అర్హత కలిగి లబ్ది పొందలేకపోయితే వారికి మరో అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. పారదర్శకతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. 

Also read: మధ్యాహ్నం నుంచే రూ. 2,500 పింఛన్ పంపిణీ.. వాళ్లకు కొత్త ఏడాది అయిన మంచి ఆలోచనలు రావాలి : సీఎం జగన్

వచ్చిన ఏడాదే 1.30 లక్షల ఉద్యోగాలు కల్పించామని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. క్యాలెండర్ ప్రకారం పోస్టులు విడుదల చేస్తున్నామని చెప్పారు. అయితే తాము వీటిని ప్రచారం చేసుకోకలేకపోతున్నామని.. బాధ్యతగా ఉద్యోగాలు కల్పిస్తున్నామని అన్నారు. సంక్షేమ ఫలాలు కిందిస్థాయికి అందింతే వారే తమను గుర్తిస్తారనే నమ్మకంతో జగన్ ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షం పేరుతో విషం కక్కుతున్న పట్టించుకోకుండా అభివృద్ది కోసం పని చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు సూటిగా ప్రశ్నించలేక.. సమస్యలను క్రియేట్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు. 20 ఏళ్ల క్రితం ఇటువంటి రాజకీయాన్ని ఎవరూ ఊహించలేదని అన్నారు. 

click me!