ప్రధాని కావాలని ఆశ.. నీ కోరికను క్రీస్తు కూడా హర్షించడు: జగన్‌పై రఘురామ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 12, 2021, 02:32 PM IST
ప్రధాని కావాలని ఆశ.. నీ కోరికను క్రీస్తు కూడా హర్షించడు: జగన్‌పై రఘురామ వ్యాఖ్యలు

సారాంశం

వైసీపీ ఫైర్ బ్రాండ్, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.  జగన్‌కు ప్రధానమంత్రి కావాలని ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కూడగట్టిన డబ్బులతో ప్రధానమంత్రి కావాలన్న జగన్ కోరికను పైనున్న దేవతలు, ఆయన నమ్మిన క్రీస్తు కూడా హర్షించరని రఘురామకృష్ణంరాజు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితులకు చాలా అన్యాయం జరుగుతోందని రఘురామ విమర్శించారు. ఆస్పత్రుల్లో జరుగుతున్న అన్యాయాలను పట్టించుకునేవారు లేరని, సీఎం జగన్ నిర్లక్ష్యంవల్లనే 46 మంది చనిపోయారని ఎంపీ ఆరోపించారు.

Also Read:ఏపీ సీఎం జగన్ కి బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు అవసరమా?: రఘురామ

మన తప్పు కానప్పటికి మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చేసిన  వ్యాఖ్యలపై రఘురామ మండిపడ్డారు. సీఎం తన జేబులోంచి డబ్బులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడంకాదని.. ముందు జగన్‌పై కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏపీలో కరోనా కేసులకు సంబంధించి దొంగ లెక్కలు చెబుతున్నారని రఘురామ ఆరోపించారు. కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుంటే రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టకుండా కర్ఫ్యూ పెట్టడమేంటని ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలు, శవాలతో వ్యాపారం చేయడం సరికాదని రఘురామ కృష్ణంరాజు హితవుపలికారు.

PREV
click me!

Recommended Stories

ధవళేశ్వరం బ్యారేజ్ పరిశీలించిన సీఎం చంద్రబాబు | Sir Arthur Cotton Barrage Gate Renovation
పిచ్చుకులంకలో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Naidu Speech at Dowleswaram Barrage