దిశ యాప్ పై మహిళా నేతలతో చంద్రబాబు కుట్ర: రోజా

Published : Feb 12, 2020, 03:42 PM IST
దిశ యాప్ పై మహిళా నేతలతో చంద్రబాబు కుట్ర: రోజా

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. కృష్ణా రామా అంటూ ఇంట్లో కూర్చోవాలని ఆమె చంద్రబాబుకు సలహా ఇచ్చారు. ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని రోజా అన్నారు.

తిరుపతి: దిశ యాప్ మీద టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ మహిళా నేతలతో కలిసి నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. అతి చేస్తే ఒక్క దెబ్బతో 80 శాతం మంది టీడీపీ నేతలను జైలు పాలు చేయగలమని ఆమె హెచ్చరించారు. నిరాధారమైన ఆరోపణలతో టీడీపీ నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. 

రోజా బుధవారంనాడు తిరుమలలో మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత చందర్బాబు నిర్వహించ తలపెట్టిన బస్సు యాత్రను ఆమె తప్పు పట్టారు. ఏపీ ప్రజలు చైతన్యవంతులై చంద్రబాబును, టీడీపీ నేతలను మూలన కూర్చోబెట్టారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా బుద్ధిరాని చంద్రబాబు బస్సు యాత్ర చేస్తానని అనడం హాస్యాస్పదమని ఆమె అన్నారు. 

మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో పర్యటిస్తారని ఆమె ప్రశ్నించారు చంద్రబాబును ప్రజలు తరిమికొట్టాలని రోజా పిలుపునిచ్చారు. జగన్ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. 

చంద్రబాబు రియల్ ఎస్టేట్ కోసం పనిచేస్తారని, జగన్ రాష్ట్రం కోసం పనిచేస్తారని ఆమె అన్నారు. 14 రోజులు గడిచినందువల్ల సెలెక్ట్ కమిటీ ఏర్పటాు చేయకపోతే మూడు రాజధానుల బిల్లు చట్టంగా మారినట్లేనని ఆమె చెప్పారు. చంద్రబాబు అహంకారాన్ని చూసి దేవుడు కూడా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడని ఆమె అన్నారు. 

నారా లోకేష్ కనుసన్నల్లో టీడీపీ సోషల్ మీడియా విభాగం వైసీపీపై విషం చిమ్మడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆమె చెప్పారు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం నాయకులపై తాము ఫిర్యాదు చేయడం ప్రారంభిస్తే వారిలో  80 శాతం మంది  జైళ్ల పాలవుతారని హెచ్చరించారు. చంద్రబాబుకు వయస్సు మీద పడిందని, కృష్ణా రామా అంటూ ఇంట్లో కూర్చుంటే మంచిదని ఆమె అన్నారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Celebrations 2026: గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పీచ్ | Asianet Telugu
Republic Day Celebrations in Amaravati: చంద్రబాబుకి పవన్ కి లోకేష్ ఘన స్వాగతం| Asianet News Telugu