ఆయేషా కేసులో ట్విస్ట్: తలలో గాయం, సీబీఐకి నివేదిక

By narsimha lodeFirst Published Feb 12, 2020, 3:05 PM IST
Highlights

బీ. ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్య కేసులో షాకింగ్ విషయం వెలుగు చూసింది. ఆమె తలపై గాయం ఉన్నట్టుగా రీ పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈ నివేదిక సీబీఐకి అందింది.

అమరావతి:బి. ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఆయేషా మీరా తల ఎముకలో గాయాలు ఉన్నట్టుగా ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది.

ఆయేసా మీరా  కేసును  సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా సీబీఐ  అధికారులు  ఆయేషా మీరా మృతదేహన్ని వెలికితీసి రీ పోస్టుమార్టం నిర్వహించారు. రీపోస్టుమార్టం నివేదికలు సీబీఐకు  చేరింది.

Also read:అయేషా మీరా మృతదేహనికి రీ పోస్టుమార్టం: ఎలా చేస్తారు?

ఆయేషా మీరా మృతదేహానికి ఈ ఏడాది డిసెంబర్ 15వ తేదీన తెనాలి చెంచుపెటలో ఉన్న స్మశానవాటికలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. రీపోస్టుమార్టం సమయంలో కొన్ని ఎముకలను సేకరించి ల్యాబ్‌లో పరీక్షించారు.

ఆయేషా మీరా తల ఎముకలో గాయాలు ఉన్నట్టుగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.  మృతి చెందిన సమయంలో ఆయేషా మీరా వయస్సు 19 ఏళ్లుగా నివేదిక చెబుతోంది. ఈ నివేదిక  ఆధారంగా సీబీఐ అధికారులు దర్యాప్తును చేయనున్నారు. 

అయేషా మీరా హత్య జరిగి సుమారు 12 ఏళ్లు అవుతోంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2007 డిసెంబర్ 27వ తేదీన ఇబ్రహీంపట్నంలోని హాస్టల్‌లో అయేషా మీరా హత్యకు గురైంది.  

ఈ కేసులో సత్యంబాబును దోషిగా గుర్తించి పోలీసులు రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కేసులో సత్యం బాబు దోషి కాదని హైకోర్టు తేల్చడంతో ఆయన జైలు నుండి విడుదలయ్యారు. 

సత్యంబాబు కూడ జైలు నుండి విడుదల కావడంతో అసలు దోషులు ఎవరనే విషయమై తేల్చేందుకు ఈ కేసును సీబీఐకు అప్పగించింది హైకోర్టు. సీబీఐ అధికారులు ఈ కేసును మొదటి నుండి విచారణ చేయడం ప్రారంభించారు.ఈ క్రమంలోనే ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. 

click me!