పవన్ కర్నూలు పర్యటనలో ఉద్రిక్తత: అడ్డుకున్న విద్యార్థులు, పోలీసుల మోహరింపు

By Siva KodatiFirst Published Feb 12, 2020, 3:38 PM IST
Highlights

కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. పవన్ పర్యటనను నిరసిస్తూ రాయలసీమ విద్యార్ధి జేఏసీ నేతలు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారు పవన్ కల్యాణ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. పవన్ పర్యటనను నిరసిస్తూ రాయలసీమ విద్యార్ధి జేఏసీ నేతలు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారు పవన్ కల్యాణ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

Also Read:పవన్ పర్యటన.. ప్రభుత్వంలో కదలిక: సుగాలి ప్రీతి కేసు సీబీఐ చేతికి...?

అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు విద్యార్ధి నేతలను అదుపులోకి తీసుకున్నారు. తమను అక్రమంగా అరెస్ట్ చేయడంపై విద్యార్ధి నేతలు మండిపడుతున్నారు. తమ అరెస్ట్‌లు అప్రజాస్వామికమని.. అదుపులోకి తీసుకోవాల్సింది పవన్ కల్యాణ్‌ను అంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

వికేంద్రీకరణ బిల్లుకు మద్ధతు తెలిపిన తర్వాతే పవన్ రాయలసీమలో అడుగు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సీమ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా జనసేనాని వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు.

Also Read:దిశ యాప్‌తో ఏపీ పోలీసుల తొలి సక్సెస్: 6 నిమిషాల్లో స్పాట్‌కి, ఆకతాయి అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి హత్యాచారం కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ పవన్ ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్‌కు మద్ధతుగా రాయలసీమ జిల్లాల నుంచి నాయకులు, శ్రేణులు, ప్రజాసంఘాలు స్థానిక రాజ్ విహార్ కూడలికి భారీగా చేరుకున్నారు. 

click me!