ఎమ్మెల్యే రోజా ఉదారత:రూ.4లకే భోజనం

Published : Nov 17, 2018, 04:47 PM IST
ఎమ్మెల్యే రోజా ఉదారత:రూ.4లకే భోజనం

సారాంశం

ఆకలితో ఎవరూ ఉండకూదన్న ఉద్దేశంతో నాలుగు రూపాయలకే భోజనం పేరుతో వైఎస్ఆర్ క్యాంటీన్ వంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అన్నదాత. సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని అనతికాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ అందరిని కలుపుకుపోయే మనిషి ఆమె. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా ఇంకెవరు. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్ కే రోజా. 

చిత్తూరు: ఆకలితో ఎవరూ ఉండకూదన్న ఉద్దేశంతో నాలుగు రూపాయలకే భోజనం పేరుతో వైఎస్ఆర్ క్యాంటీన్ వంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అన్నదాత. సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని అనతికాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ అందరిని కలుపుకుపోయే మనిషి ఆమె. ఇంతకీ ఎవరామె అనుకుంటున్నారా ఇంకెవరు. వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్ కే రోజా. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆర్ కే రోజా ది ప్రత్యేక స్థానం అని చెప్పుకోవాలి. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న నాయకురాల్లో ఒకరు. నగరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందరి మన్నలను అందుకుంటున్నారు. 

ఇకపోతే తన పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే అంగన్వాడి భవనానికి భూమి పూజ చేశారు. 

మరోవైపు ఎమ్మెల్యే ఆర్కే రోజా పుట్టినరోజు సందర్భంగా నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయంలో భాగంగా పేదవాడు ఎవరు ఆకలితో ఉండకూడదన్న ఆలోచనతో రోజా చారిటబుల్ ట్రస్ట్ నిధులతో ప్రతిరోజు రూపాయలు 4కే భోజనం అందించేలా వైయస్సార్ క్యాంటీన్  పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.  

రోజా పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యకర్తల సమక్షంలో రోజా కేక్ కట్ చేసి తన జన్మదినాన్ని జరుపుకున్నారు. ప్రజల అండదండలు తనకు ఎల్లప్పుడూ ఉండాలని రోజా కోరారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్