చంద్రబాబు, లోకేష్ ల టార్గెట్ అదే...:బొత్స

Published : Nov 17, 2018, 01:02 PM IST
చంద్రబాబు, లోకేష్ ల టార్గెట్ అదే...:బొత్స

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ లపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. చంద్రబాబు, లోకేష్ లు దారిదోపిడీకి తెరతీశారని విమర్శించారు. శనివారం విశాఖపట్నంలో మాట్లాడిన బొత్స హాయ్ లాండ్ ను లోకేష్ అన్యాక్రాంతం చెయ్యాలని చూస్తున్నారని ఆరోపించారు.  

విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ లపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. చంద్రబాబు, లోకేష్ లు దారిదోపిడీకి తెరతీశారని విమర్శించారు. శనివారం విశాఖపట్నంలో మాట్లాడిన బొత్స హాయ్ లాండ్ ను లోకేష్ అన్యాక్రాంతం చెయ్యాలని చూస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబుకు ధనదాహం తీరలేదంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు బొత్స. హాయ్ లాండ్ ను కొట్టేయ్యాలన్నదే చంద్రబాబు, లోకేష్ ల టార్గెట్ అని ఆరోపించారు. 19లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులను చంద్రబాబు అండ్ కో నట్టేట ముంచారంటూ ధ్వజమెత్తారు. గతంలో అప్పులకు మించి అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయన్న చంద్రబాబు ఇప్పుడు మాటమార్చారని మండిపడ్డారు. 

బాధితులకు న్యాయం చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. అడ్డదారుల్లో అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టెయ్యాలని చూస్తున్నారన్నారు. టీడీపీ నేతలు కోర్టులను సైతం మోసం చేసే స్థాయికి దిగజారిపోయారంటూ ఎద్దేవా చేశారు బొత్స. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. అన్యాక్రాంతమైన అగ్రిగోల్డ్ ఆస్తులను బయటకు రప్పిస్తామని హామీ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

Pemmasani Chandrasekhar Spech: 25 సంవత్సరాల ముందు చంద్రబాబు విజన్ ఈ సంఘాలు| Asianet News Telugu
YS Jagan Pressmeet: 2026లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుందని అప్పుడే చెప్పా | Asianet News Telugu