
వైసీపి అధ్యక్షుడు జగన్ చేసిన వివాదాస్పద ఆరోపణలను సమర్ధించలేక నానా అవస్థలు పడుతుంది ఎమ్మెల్యే రోజా. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఎంత కలకలం సృష్టించిందో అందరికి తెలిసిందే. నంద్యాల బహిరంగ సభలో మాట్లాడుతు చంద్రబాబను కాల్చి చంపాలని జగన్ అన్నారు. ఆ వ్యాఖ్యల వేడి చల్లారకుండానే రోడ్ షో లో మాట్లాడుతు చంద్రబాబును ఉరితీసిన తప్పులేదని జగన్ మళ్లీ వ్యాఖ్యానించారు. దాంతో ఇరు పార్టీల మధ్య దుమారం రేగింది. ఇదే విషయం పై రోజా శుక్రవారం మీడియాతో మాట్లాడుతు.. జగన్ వ్యాఖ్యలు ను సమర్ధించారు. పైగా జగన్ వ్యాఖ్యలను వక్రీకరించారని, మంత్రుల పై ఎదురు దాడిని మొదలు పెట్టడం గమనార్హం. పనిలో పనిగా మంత్రి అఖిల ప్రియా మీదా కూడా ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతికి పెట్టిందే పేరుగా ఆమె విరుచుపడ్డారు. రాజకీయలను భ్రస్టు పట్టించింది చంద్రబాబేనని రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబును ప్రజాకోర్టులో నిలదీసిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ మంత్రులు, నేతలు విమర్శించడాన్ని రోజా ఖండించారు. టీడీపీ నేతలకు కనీస నైతిక విలువలు లేవని, తమ నాయుకుడు జగన్ గురించి మాట్లాడే అర్హతలేదని పెర్కొన్నారు. చంద్రబాబు రాజకీయమే దుర్మార్గం అని, ఆయన కుట్రలకు కుతంత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. రాయలసీమ నేడు ఈ గతి పట్టిందంటే కారణం చంద్రబాబే అని అన్నారు. సీమకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో నాటి సీఎం వైఎస్సార్ పనిచేశారని చెప్పుకొచ్చారు.
చంద్రబాబుకు పట్టిన పబ్లిసిటీ పిచ్చితో 29 మంది గోదావరి పుష్కరాల్లో మరణించారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిని బయట పెట్టిన వాళ్లపై తనకున్న మీడియాతో బురదజల్లించడం అలవాటని ఆమె అన్నారు. సోనియా, చంద్రబాబు కుమ్మకై వైఎస్ జగన్‌పై కేసులు బనాయించారని తెలిపారు.
అదేవిధంగా మంత్రి అఖిల ప్రియపై రోజా ఫైర్ అయ్యారు. అఖిలకి అస్సలు మంత్రి అవ్వడానికి ఉన్న అర్హతలు ఏంటని ప్రశ్నంచారు. అమ్మలేదు, నాన్నా లేదు అని చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ను అఖిల చదువుతుందని ఆరోపించారు. వైసీపిలో ఉండగా భూమా కుటుంబం పై బాబు సాగించిన అరాచకాలు కర్నూలు ప్రజలకు తెలుసునని ఆమె పెర్కొన్నారు.
రోజా తమ అధ్యక్షుడు చేసిన వివదాస్పద వ్యాఖ్యలను వ్యాఖ్యలను సమర్ధించలేక తిరిగి టీడీపీ నేతల పై ధ్వజమెత్తారు