జ‌గ‌న్ పై త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాలి

First Published Aug 11, 2017, 4:45 PM IST
Highlights
  • జగన్ పై తక్షణం చర్యలు తీసుకోవాలి
  • జగన్ కి ఉన్మాదం పెరిగిపోయిందని వ్యాఖ్య.
  • ముఖ్యయంత్రి పై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నాయకుడిని చూడలేదన్నారు.

 వైసీపి అధ్య‌క్షుడు జగన్మోహన రెడ్డి పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు. ప్రతిపక్ష నాయకుడిగా జ‌గ‌న్‌ ఏమాత్రం త‌గ‌డ‌ని ధ్వ‌జ‌మెత్తారు. రోజురోజుకు జగన్ ఉన్మాదం తారాస్థాయికి చేరుతుంద‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పార్టీకి, నాయకుడికి చోటు లేదని ఆయ‌న జ‌గ‌న్ పై మీడియా స‌మావేశంలో ఆరోపించారు.

జ‌గ‌న్ కి ముఖ్యమంత్రి పదవి దక్కదనే అసూయతో ఉన్మాదిగా మారారని అన్నారు య‌న‌మ‌ల‌. ఎవ‌రైనా నాయ‌కుడు  ముఖ్యమంత్రిని పట్టుకుని కాల్చిచంపమనడం, ఉరితీయమనడం గతంలో మనం విన్నామా... ! అని ఆయ‌న ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ ఎన్ని తిట్లు తిడితే అన్ని ఓట్లు పడతాయని త‌న నూత‌న‌ కన్సల్టెంట్ పీకే (ప్ర‌శాంత్ కిశోర్‌) చెప్పినట్లున్నారని ఎద్దేవా చేశారు. కానీ జ‌గ‌న్‌ ఎన్ని తిట్లు తిడితే అన్నివేల ఓట్లు పోతాయనేది తెలుసుకోలేక పోతున్నార‌ని ఎద్దేవా చేశారు.


జ‌గ‌న్ త‌న‌ వ్యాఖ్య‌ల‌తో స‌మాజంలో ఉండే అర్హతను కోల్పోయారని మంత్రి అన్నారు. ఒక రాజకీయ నాయకుడి ఉండే లక్షణం ఒక్కటి కూడా జ‌గ‌న్ కి లేదని విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి పై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఎన్నికల సంఘం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జ‌గ‌న్ పై ఎలాంటి శిక్ష విధించాలో, న్యాయ వ్య‌వ‌స్థ‌, పోలీసులు అధికారులే నిర్ణ‌యించాల‌ని పెర్కోన్నారు.
 

click me!