కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

By Siva Kodati  |  First Published Aug 23, 2019, 10:02 AM IST

టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నివాసంలో చోరీ జరిగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఆయన నివాసంలోకి కరెంట్ పనుల కోసమంటూ ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు


టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నివాసంలో చోరీ జరిగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఆయన నివాసంలోకి కరెంట్ పనుల కోసమంటూ ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు.

అనంతరం వారిని వాచ్‌మెన్ అడ్డుకోబోగా.. అతనిని పక్కకునెట్టి కంప్యూటర్లతో పరారయ్యారు. వెంటనే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడెలకు సైతం సమాచారం అందించినట్లు ఆయన సిబ్బంది తెలిపారు.

Latest Videos

undefined

చోరికి యత్నించిన వారు గతంలో కోడెల వద్ద పనిచేసిన వారిగా గుర్తించారు. ఒకరు సత్తెనపల్లి మున్సిపల్ ఉద్యోగి అర్జునుడిగా తెలుస్తోంది. చోరికి గురైన రెండు కంప్యూటర్లలో ఒకదానిని తిరిగి కోడెల కార్యాలయం గోడ వెనుక పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

శివప్రసాదరావు స్పీకర్‌గా ఉన్న సమయంలో అర్జునుడు తాత్కాలిక కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. మరికాసేపట్లో కోడెల సత్తెనపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.

మరోవైపు అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్ గుంటూరు, సత్తెనపల్లిలోని కోడెల కార్యాలయాల్లో ఉంది. దీనిని శుక్రవారం శాసనసభ సిబ్బంది స్వాధీనం చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో చోరీ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

click me!