తిరుమల కొండపై వివాదం: ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రకటనలు

Siva Kodati |  
Published : Aug 23, 2019, 08:13 AM ISTUpdated : Aug 23, 2019, 10:55 AM IST
తిరుమల కొండపై వివాదం: ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రకటనలు

సారాంశం

తిరుమల శ్రీవారి ఏడుకొండలపై మరోసారి అన్యమత ప్రచారం వివాదం తలెత్తింది. వెంకన్న దర్శనం కోసం తిరుమలలో ఆర్టీసీ బస్సు ఎక్కగా.. వారికిచ్చిన టిక్కెట్లపై జెరూసలేం యాత్ర, హజ్ యాత్రలకు సంబంధించిన ప్రకటనలు భక్తులకు కనిపించాయి

తిరుమల శ్రీవారి ఏడుకొండలపై మరోసారి అన్యమత ప్రచారం వివాదం తలెత్తింది. వెంకన్న దర్శనం కోసం తిరుమలలో ఆర్టీసీ బస్సు ఎక్కగా.. వారికిచ్చిన టిక్కెట్లపై జెరూసలేం యాత్ర, హజ్ యాత్రలకు సంబంధించిన ప్రకటనలు భక్తులకు కనిపించాయి.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు ఆర్టీసీ అధికారులను నిలదీశారు. పొరపాటును గ్రహించిన అధికారులు.. టిక్కెట్లకు సంబంధించిన రోల్స్‌ను తీసివేశారు.

నెల్లూరు నుంచి పొరపాటున ఐదు టికెట్ రోల్స్ తిరుమలకు వచ్చాయని వాటిని సిబ్బంది గమనించలేదని అధికారులు తెలిపారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ డీఎం హామీ ఇవ్వడంతో భక్తులు శాంతించారు. 

PREV
click me!

Recommended Stories

ఊహించని న్యూస్ చెప్పిన Pemmasani Chandrashekar | Chandrababu | Asianet Telugu
Chandrababu Great Speech About Janasena | Pawan Kalyan | Asianet Telugu