తిరుపతి సమీపంలో రోడ్డు ప్రమాదం.. మహారాష్ట్రకు చెందిన నలుగురు భక్తులు మృతి

By team telugu  |  First Published Jan 26, 2023, 11:59 AM IST

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమతి సమీపంలో ఉన్న చంద్రగిరి మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్వామి వారిని దర్శించుకొని కాణిపాకానికి బయల్దేరిన వాహనం  నాయుడుపేట-పూతలపట్టు హైవేపై ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన నలుగురు భక్తులు మరణించారు.  


తిరుమల తిరుపతి సమీపంలోని చంద్రగిరి మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన నలుగురు భక్తులు మరణించారు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాకు చెందిన భక్తులు తిరుమల దేవస్థానాన్ని దర్శించుకున్నారు. అనంతరం కాణిపాకం ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రయాణం ప్రారంభించారు.

వేతనాల విషయంలో గొడవ.. కార్మికుడిని నరికి చంపి, మృతదేహాన్ని పొదల్లో పడేశారు..

Latest Videos

ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం నాయుడుపేట-పూతలపట్టు హైవే వెంబడి కల్‌రోడ్‌పల్లి గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఓ కల్వర్టును ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందడంతో స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను తిరుపతిలోని ఎస్వీఆర్‌ఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా..ఈ ఘటనలో నలుగురు మరణించారు. మృతులను అనంత్ తెంబుకర్, మయూర్, రిషికేశ్, అజయ్‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు సమాచారం అందించారు.

దారుణం.. ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి యువకుడి అత్యాచారం..

ఇలాంటి ఒకటి ఇటీవల ఒడిశాలో చోటు చేసుకుంది. తీర్థ యాత్రలకు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురవడంతో ఇద్దరు మరణించారు. 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ధెంకనల్ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచుబాటి సమీపంలోని బ్రిడ్జిపై నుంచి టూరిస్టు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. గత సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నీలమాధబ్ అనే టూరిస్టు బస్సు డ్రైవర్ స్టీరింగ్ పై కంట్రోల్ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పింది. నేరుగా వంతెన రెయిలింగ్ ను ఢీకొట్టింది. తరువాత కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిని కేంద్రపారా జిల్లా ఇచ్ఛాపూర్ గ్రామానికి చెందిన రేణుబాల జెనా, బిజయలక్ష్మి స్వైన్‌లుగా గుర్తించారు.

రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు..

స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను దెంకనల్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ కు తరలించారు. ఈ బస్సులో మొత్తంగా 43 మంది ప్రయాణికులు ఉండగా.. వీరంతా ఇచ్ఛాపూర్ గ్రామం నుంచి బలంగీర్, సంబల్‌పూర్‌కు విహారయాత్రకు వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బస్సు స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించారు. 
 

click me!