సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత గవర్నర్ ప్రసంగించారు.
విజయవాడ:రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు భేష్ అని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. డీబీటీ ద్వారా నవరత్నాలు , అమ్మఒడి వంటి పథకాలు అర్హులకే అందుతున్నాయని ఆయన చెప్పారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాస్ట్రం ముందుకు సాగుగుతుందని గవర్నర్ చెప్పారు. రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్పిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు..
జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్ధులకు పౌష్టికాహరం అందిస్తున్నామన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్దులకు పుస్తకాలు, దుస్తులు, కిట్స్ అందిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యార్ధులకు సీబీఎస్ఈ సిలబస్ ను అందిస్తున్నట్టుగా గవర్నర్ గుర్తు చేశారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
undefined
నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పఠశాలల అభివృద్ది జరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక రంగానికి వ్యవసాయం వెన్నెముక అని గవర్నర్ తెలిపారు. రైతాంగానికి అండగా ఉండేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో 10 వేల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్టుగా గవర్నర్ వివరించారు.రైతు పండించిన పంటకు మద్దతు ధర అందించి రైతులకు అండగా ప్రభుత్వం నిలిచిందన్నారు. ప్రతి ఏటా రైతులకు రూ. 13, 500 సహాయం అందిస్తున్న విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. 37 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ పంటల భీమాను వర్తింపచేసినట్టుగా గవర్నర్ చెప్పారు. త్వరలోనే సంచార పశువైద్య క్లినిక్ లు అందుబాటులోకి వస్తాయన్నారు.
రాష్ట్రంలో 11 బోధనా ఆసుపత్రులను నిర్మిస్తున్నట్టుగా గవర్నర్ చెప్పారు. అంతేకాదు కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్టుగా గవర్నర్ తెలిపారు. గర్భిణులు, బలింతల ఆరోగ్య బాధ్యతలను ప్రభుత్వం తీసుకందన్నారు.
వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా రూ. 2750 సహయం అందిస్తున్నట్టుగా గవర్నర్ తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా కింద పేద మహిళలకు ఏటా రూ. 15 వేల సహయం అందిస్తున్నట్టుగా గవర్నర్ వివరించారు. కాపు నేస్తం ద్వారా ఇప్పటివరకు రూ. 1518 కోట్ల సహాయం అందించినట్టుగా గవర్నర్ తెలిపారు.