
అనంతపురం జిల్లాలో (anantapur district) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విడపనకల్లు (vidapanakal) మండలం డోనేకల్లు (donekal) గ్రామం వద్ద ప్రమాదవశాత్తూ ఓ కారు నీటి గుంతలో పడింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు కుటుంబసభ్యులు వున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్రేన్ సాయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బళ్లారి - గుంతకల్లు హైవేపై (bellary guntakal highway) పనులు జరుగుతున్నాయి. వీటిని నిర్వహిస్తున్న కాంట్రాక్టర్.. రోడ్డుపై ఎలాంటి సైన్ బోర్డులు పెట్టకపోవడంతో ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.