తలపై నుండి దూసుకెళ్లిన వాహనం... బైకర్ దారుణ మృతి

Arun Kumar P   | Asianet News
Published : Jun 07, 2021, 12:01 PM IST
తలపై నుండి దూసుకెళ్లిన వాహనం... బైకర్ దారుణ మృతి

సారాంశం

ఓ ద్విచక్రవాహనదారుడు ఆటోను ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయాడు. 

విజయవాడ: కృష్ణా జిల్లాలోని పెడన సమీపంలో జాతీయ రహదారి 216పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ ద్విచక్రవాహనదారుడు ఆటోను ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదానికి గురయ్యాడు. అతడు రోడ్డుమీద పడిపోగా వెనకనుండి వచ్చిన వాహనం తలపైనుండి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. 

బందరు మండలం మంగినపూడి శివారు రెడ్డి పాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పని వుండటంతో తన బైక్ పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే అతడు జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ పెడన సమీపంలోని బంటుమిల్లి రోడ్డు సింగరాయపాలెం ప్రాంతం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వేగంగా వెళలుతూ ఓ ఆటోను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించి అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఇదే సమయంలో వెనకాలనుండి వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం అతడి తలపైనుండి దూసుకెళ్లింది. దీంతో తల చిధ్రమై బైకర్ అక్కడిక్కడే చనిపోయాడు. 

read more  వాహనదారులకు అలెర్ట్: హెల్మెట్లపై కొత్త నిబంధనలు.. పాటించకపోతే జరిమానాతో పాటు జైలు శిక్ష..

అతడి తలపై ఎక్కడంతో టాటా ఏస్ వాహనం కూడా అదుపుతప్పింది. దీంతో అందులోని కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పెడన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే ప్రమాదానికి కారణమైన వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?