వివాహితను బెదిరించి వ్యభిచారం చేయించడంతో పాటు, ఆమె డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన ఇద్దరు వ్యక్తుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా, నరసరావుపేటలో తనతో పాటు, తన కుమార్తెను చంపుతామని బెదిరించి తనతో ముంబైలో వ్యభిచారం చేయించారని, ఆ డబ్బులు మొత్తం తీసుకుని మోసం చేశారని ఆ ఇద్దరు వ్యక్తుల మీద కేసు నమోదు చేస చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన ఓ వివాహిత నరసరావుపేట వన్ టౌన్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెడితే... 26యేళ్ల ఓ మహిళ భర్తతో విడిపోయి పోద్ద కుమార్తెతో కలిసి పట్టణంలోని ప్రకాష్ నగర్ లో ఉంటున్న తల్లి దగ్గరికి వచ్చి ఉంటోంది. 2017నుంచి తల్లితోనే కలిసి నివసిస్తోంది. అయితే అప్పటికే ఆమె తల్లి దూదేకుల మీరావలితో సహజీవనం చేస్తోంది.
మీరావలి కన్ను వివాహిత మీద పడింది. అతను ఆమెను బెదిరించి తను చెప్పిన వ్యక్తులతో వ్యభిచారం చేయకపోతే ఆమెను, ఆమె కూతుర్ని చంపుతానని భయపెట్టాడు. బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడు. ముందు దీనికి ఆ మహిళ ఒప్పుకోకపోవడంతో... దూదేకుల మీరావలి, తన స్నేహితుడైన చాగల్లు గ్రామానికి చెందిన సైదాతో కలిసి ఆ యువతిని కొట్టి బలవంతంగా ముంబాయి తరలించాడు.
అక్కడ తొమ్మిది నెలల పాటు వ్యభిచారం చేయించారు. వచ్చిన డబ్బును యువతి కుమార్తె పేరుమీద వేస్తామని నమ్మబలికిన మీరావలి, సైదా తమ అకౌంట్లకు జమ చేసుకున్నారు.
తొమ్మదినెలల తరువాత తరువాత నసరావుపేటకు వచ్చిన ఆమె తన డబ్బు గురించి మీరావలిని నిలదీయగా.. మళ్లీ కొట్టి బలవంతంగా ఐదు నెలలపాటు వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లి వ్యభిచారం చేయించారని పేర్కొంది. కొంతకాలంగా మీరావలి చెప్పిన పని చేయకూడదని ఆ వివాహిత నిర్ణయించుకుంది.
అయితే మళలీ వ్యభిచారం చేయకపోతే చంపుతామని మీరావలి, సైదా బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిందని సీఐ ఎం.ప్రభాకరరావు తెలిపారు. తనతో బలవంతంగా వ్యభిచారం చేయించి సుమారు రూ.15 లక్షలు కాజేసిన మీరావలి, సైదా మీద చర్యలు తీసుకోవాలని ఆమె చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.